Kurnool HC Demand : ఒకప్పుడు రాజధాని కోల్పోయాం..ఇప్పుడు హైకోర్టు లేకుండా చేయాలనిచూస్తే ఊరుకోం

ఒకప్పుడు రాజధాని కోల్పోయాం..ఇప్పుడు హైకోర్టు లేకుండా చేయాలనిచూస్తే ఊరుకోం అని రాయసీమ విద్యార్ధి, యువజన జేఏసీ హెచ్చరించింది.

Kurnool HC Demand : ఒకప్పుడు రాజధాని కోల్పోయాం..ఇప్పుడు హైకోర్టు లేకుండా చేయాలనిచూస్తే ఊరుకోం

Kurnool Hc Demand

Updated On : December 16, 2021 / 1:12 PM IST

Rayalaseema selfrespect program : రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం (డిసెంబర్ 16,2021)కర్నూలులోని ప్రభుత్వ టౌన్‌ మోడల్‌ జూనియర్‌ కళాశాలలో రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ ఆత్మగౌరవ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగారాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నేతలు మాట్లాడుతు..ఒకప్పుడు మేం రాజధానిని కోల్పోయాం..ఇప్పుడు కర్నూలుకు ప్రకటించిన హైకోర్టును పోగొట్టుకోం అంటూ నినదించారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు ఒకేచోట అభివృద్ధి జరగాలని కోరుకోవటం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు.

Read more : Farmer Protest: రైతుల్ని చంపిన ఆ మంత్రి రాజీనామా చెయ్యాలి – రాహుల్ గాంధీ

మూడు రాజధానులను వ్యతిరేకిస్తు అమరావతికి అనుకూలంగా మాట్లాడే రాయలసీమ నేతలకు ఇళ్లను ముట్టడిస్తామని తెలిపారు. మూడు రాజధానులు అని ప్రకటించిన సీఎం జగన్ ఇప్పుడు వెనకడుగు వేయటం సరికాదని..వెంటనే మూడు రాజధానుల బిల్లను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదించాలని ఈ సందర్బంగా విద్యార్ధి, యువజన సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.

అలాగే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధి చేయాలని కోరారు. ఒకప్పుడు రాజధానిని కోల్పోయాం..ఇప్పుడు హైకోర్టును కోల్పోవటానికి మేం సిద్ధంగా లేమని..హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాల్సిందేని లేదంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Read more : Supreme Court :వాళ్లు మనుషులే..సెక్స్ వర్కర్లకు ఆధార్, రేషన్ కార్డులు ఇవ్వండి: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం

కాగా కర్నూలులో శ్రీబాగ్‌ ఒప్పందంలో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమలో తాగునీరు ప్రాజెక్టులు నిర్మించాలని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ ఆత్మగౌరవ బహిరంగ సభ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.