Thirumala : నేడు శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఇవాళ విడుదల చేయనున్నారు. నవంబర్‌ నెలకు సంబంధించిన ఉచిత టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు.

Tirumala

Sri Venkateswara Swamy Sarvadarshanam : తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఇవాళ విడుదల చేయనున్నారు. నవంబర్‌ నెలకు సంబంధించిన ఉచిత టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. ఉదయం 9 గంటలకు టికెట్లను విడుదల చేయనున్నారు.

రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. సర్వదర్శనం టికెట్లను కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో శ్రీనివాసం కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్‌ టికెట్‌ కౌంటర్‌ను మూసివేశారు. అక్టోబర్ నెలకు సంబంధించిన కోటా టికెట్లను సెప్టెంబర్‌ 26న టీటీడీ విడుదల చేసింది.

Tirumala Srivaru : తిరుమల శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం

సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను విడుదల చేయగా అర్ధగంటలోపే ఖాళీ అయ్యాయి. రోజుకు 8వేల చొప్పున మొత్తం 35 రోజుల టికెట్లను 30 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకున్నారు.

నేడు శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదలనిన్న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేశారు. నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 9గంటల నుంచి 300 రూపాయలకు సంబంధించిన 12వేల టికెట్లను విడుదల చేశారు.