Tirumala Srivaru : తిరుమల శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం

శ్రీవారికి గో ఆధారిత నైవేద్యాన్ని మేలో ప్రవేశపెట్టామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎలాంటి ఆటంకం లేకుండా ఇప్పటివరకు గో ఆధారిత నైవేద్యం నిర్విఘ్నంగా కొనసాగుతోందన్నారు.

Tirumala Srivaru : తిరుమల శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం

Srivari Food (2)

cow-based food for Srivaru : ప్రాచీన కాల సంప్రదాయమైన శ్రీవారికి గో ఆధారిత నైవేద్యాన్ని మే నెలలో ప్రవేశపెట్టామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎలాంటి ఆటంకం లేకుండా ఇప్పటి వరకు గో ఆధారిత నైవేద్యం నిర్విఘ్నంగా కొనసాగుతోందన్నారు. శాశ్వతంగా ఈ కార్యక్రమం చేపట్టడానికి.. ఓ ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నామని చెప్పారు.

తిరుపతి మహతిలో ఈనెల 30, 31న గో మహా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గో ఆధారిత వ్యవసాయంపై రైతులకు అవగాహనా కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు. స్వామి వారికి గత నెలలో నవనీత సేవ కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. స్వామి వారికి అవసరమయ్యే వెన్నను తిరుమలలోని గో శాలలో తాయారు చేస్తున్నామని వెల్లడించారు.

Tirumala : నేటి నుంచి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదల

తిరుమలలో గోశాల విస్తరణకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. గతంలో 15 గోవులు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. ప్రస్తుతం తిరుమల గోశాలలో 60 గోవులు ఇన్నాయని..భవిషత్ లో 150 గోవులు ఉండేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. శ్రీవారికి స్వచ్ఛమైన నెయ్యిని వినియోగించే విధంగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. రాజస్థాన్ లోని ఓ గోశాలలో సూచనలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా 4లక్షల టిక్కెట్ల కేటాయింపు ఆన్లైన్ లో అందించామని చెప్పారు. నడక దారి భక్తులకు టిక్కెట్లు అందించాలని విన్నతులు వచ్చాయని తెలిపారు. త్వరలోనే నడకదారి టిక్కెట్ల కేటాయింపు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.