Rajahmundry Central Jail (Photo : Google)
Rajahmundry Central Jail – Rahul : రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అదే జైలుకి చెందిన సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లడం చర్చకు దారితీసింది. రాహుల్ భయపడి వెళ్లిపోయారు, అధికారులు బలవంతంగా ఆయనను పంపించారు అని వార్తలు వచ్చాయి.
దీనిపై కోస్తా జిల్లాల జైళ్ళశాఖ ఐజీ రవికిరణ్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీశ్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ భయపడి వెళ్లిపోయారు అనే వార్తలను ఖండించారు. అధికారులు బలవంతంగా ఆయనను పంపించారు అనేది పూర్తిగా అవాస్తవం అన్నారు. జైలు సూపరింటెండెంట్ సెలవు పై వెళ్లడానికి అసలు కారణం ఏంటో వారు వివరించారు.
Also Read..TDP- Janasena: జనసేన, టీడీపీ పొత్తు.. ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి?
”రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టడాన్ని వక్రీకరించి రాయొద్దు. కొద్దిసేపటి క్రితమే ఆయన భార్య చనిపోయారు. మేమంతా చాలా మెంటల్ స్ట్రెస్ లో ఉన్నాము. మా దగ్గర క్లారిఫికేషన్ తీసుకుని వాస్తవాలు రాయండి. రాహుల్ భయపడి వెళ్లిపోయారు, అధికారులు బలవంతంగా పంపించారు అనేవి పూర్తిగా అవాస్తవాలు.
మా పరిస్థితి అర్థం చేసుకోండి. మా బాధ్యతలను మేము ఎప్పుడూ విస్మరించము. నా తల్లి కూడా మే నెలలో చనిపోయారు. అందరం చాలా మెంటల్ స్ట్రెస్ లో ఉన్నాము. వాస్తవాలు రాయండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అవాస్తవాలు మాత్రం ప్రచురించకండి” అని కోస్తా జిల్లాల జైళ్ల డిఐజి రవికిరణ్ మీడియాకు విజ్ఞప్తి చేశారు.
Also Read..TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?
”మీడియా వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలి. జైలు సూపరింటెండెంట్ రాహుల్ విషయంలో అవాస్తవ వార్తలు వచ్చాయి. ఆయన భార్య ఆరోగ్యం బాగా లేనందునే సెలవు పెట్టారు. వార్త ప్రచురించే ముందు వాస్తవాలు కచ్చితంగా తెలుసుకోండి” అని జిల్లా ఎస్పీ జగదీశ్ అన్నారు.