Thota Trimurthulu: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నా వంతుగా నేను స్పందిస్తున్నా..: తోట త్రిమూర్తులు కామెంట్స్

తన మీద పవన్ కల్యాణ్ కు అంత కోపం ఎందుకో తనకు అర్థం కావట్లేదని చెప్పారు.

Thota Trimurthulu

Thota Trimurthulu – Pawan Kalyan: జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ (YCP) ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. జనసేన వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ కాపు సామాజిక వర్గం అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే.

దీనిపై విజయవాడలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గంపై జరుగుతున్న ప్రచారంలో భాగంగా తన వంతుగా స్పందిస్తున్నానని తెలిపారు. రాజకీయంగా ప్రయోజనాలు పొందడానికే కాపు ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు.

తామంతా ముద్రగడ స్ఫూర్తితోనే ఉద్యమంలో ముందుకు వెళ్లామని చెప్పారు. నేటి యువత తరానికి 30 ఏళ్ల క్రితం చేసిన పోరాటం గురించి తెలియదని తెలిపారు. ముద్రగడ, పవన్ మధ్య జరిగే వార్ కి ఇక ముగింపు పలకాలని అన్నారు. ఎవరినో అందలం ఎక్కించడడం మనం మనం గొడవ పడకూడదని హితవు పలికారు.

తాను వ్యక్తిగత విషయాల జోలికి పోనని చెప్పుకొచ్చారు. తాను చంద్రబాబు నాయుడి మోచేతి నీళ్లు తాగడం లేదని అన్నారు. పౌరుషం ఉన్న గోదావరి నీళ్లు తాగానని అన్నారు. తన మీద పవన్ కల్యాణ్ కు అంత కోపం ఎందుకో తనకు అర్థం కావట్లేదని చెప్పారు.

Pawan Kalyan: 14 ఏళ్ల నా అరణ్యవాసం పూర్తయింది.. ఇక నేను చేసేదంతా.. : పవన్ కల్యాణ్