గవర్నర్ వద్దకు పరిపాలన వికేంద్రీకరణ, CRDA చట్టం రద్దు బిల్లులు

  • Publish Date - July 18, 2020 / 01:31 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాక పుట్టించిన కీలక బిల్లులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరాయి. ఆయన ఆమోదిస్తారా ? లేదా ? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. దీనిపై హాట్ హాట్ టాపిక్ చర్చలు జరుగుతున్నాయి.

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను 2020, జులై 18వ తేదీ శనివారం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం గవర్నర్ వద్దకు పంపారు. కానీ వీటిని ఆమోదించవద్దని మండలి టీడీపీ నేత యనమల కోరుతున్నారు. రాజధానుల బిల్లులు గవర్నర్ ఆమోదిస్తే…గెజిట్ నోటిఫికేషన్ వస్తే..అమల్లోకి వచ్చినట్లే భావించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది.

గవర్నర్ వీటిని పరిశీలించిన అనంతరం రాష్ట్రపతి వద్దకు పంపుతారు. కేంద్ర చట్టాలతో ముడిపడిన సందర్బంగా..అక్కడకు పంపుతున్నారని సమాచారం. CRDA రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులకు సంబంధించి శాసనమండలిలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ…నిర్ణయం తీసుకున్న మండలి ఛైర్మన్ పై వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఏపీ శాసనసమండలి రద్దుకు సీఎం జగన్ మొగ్గు చూపారు. ఇందుకు సంబంధించిన బిల్లుపై కేంద్రం నుంచి ఎలాంటి ఆమోదం రాలేదు.

2020, June 16వ తేదీన శాసనసభ సమావేశాలు జరిగాయి. ఈ రెండు బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో మళ్లీ ప్రవేశ పెట్టి ఆమోదించింది. అనంతరం శాసనమండలికి బిల్లులు పంపింది అసెంబ్లీ. కానీ అక్కడ చర్చించకుండానే…సభ నిరవధికంగా వాయిదా పడింది. ఇక్కడ టీడీపీ కుట్రలు పన్నిందని వైసీపీ ఆరోపించింది.

అయితే..టెక్నికల్ గా ఓ అంశం ఉంది. తిరస్కరించినా. చర్చించకపోవడం వదిలేసినా..నెల రోజుల తరవాత..ఆటోమెటిక్ గా ఆమోదం పొందినట్లే అవుతుందని అంటున్నారు. ఇప్పుడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే.