train collision
Three Killed Train Collision : నెల్లూరులో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఆత్మకూరు బస్టాండ్ వద్ద అండర్ పాస్ ఓవర్ బ్రిడ్జీపై రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ట్రాక్ పై నడిచి వెళ్తున్న సమయంలో ధర్మవరం-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు కాగా, ఒక మహిళ ఉన్నారు. ట్రాక్ పై నడిచి వెళ్తున్నవారిని రైలు ఢీకొట్టిన వెంటనే మహిళ మృతదేహం రైల్వే బ్రిడ్జీ పైనుంచి రోడ్డుపై పడింది.
దీంతో బ్రిడ్జి కింద వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయపడ్డారు. వెంటనే కొంతమంది వెళ్లి ట్రాక్ ను పరిశీలించారు. ట్రాక్ పై ఇద్దరు పురుషుల మృతదేహాలు ఉండటాన్ని గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే, స్థానిక పోలీసులు ట్రాక్ పై చెల్లా చెదరుగా పడిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Srikakulam Train Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఐదుగురు దుర్మరణం
రైల్వే, స్థానిక పోలీసులు మృతుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదవశాత్తు చనిపోయారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్ పై నడిచి వెళ్తున్న సమయంలో నిజంగానే రైలు రాకను గమనించలేదా? లేకపోతే ముగ్గురు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.