×
Ad

AP New Districts: ఏపీలో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..

ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటునకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

AP New Districts: ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటునకు నిర్ణయం తీసుకున్నారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటునకు సీఎం ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటునకు నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటునకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

జిల్లాల పునర్ విభజన అంశంపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సీఎం చంద్రబాబుని కలిసింది. తమ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు. సీఎం చంద్రబాబు ఆ నివేదికను పరిశీలించి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జీఎంవో ఇచ్చిన నివేదికను 28వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చకు పెట్టి ఆమోదించనున్నారు.

ఇప్పటికే 77 రెవెన్యూ డివిజన్లు రాష్ట్రంలో ఉన్నాయి. కొత్తగా మరో 5 రానున్నాయి. అనకాపల్లి జిల్లాలో నక్కలపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పడే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర.. వీటిని రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే కర్నూలు జిల్లాలో ఉన్న పెద్ద హరితవనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆదోని మండలాన్ని విభజించి మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు సూచనల మేరకు మంత్రుల కమిటీ ఆమోదం తెలిపింది.

Also Read: అన్నంత పని చేస్తున్న జగన్..! స్నేహితుడిని కాదని కొత్త వారికి పగ్గాలు? వైసీపీ అధినేతలో ఎందుకింత మార్పు..!