Tiger Attack on Cows
Tiger Attack on Cows In AP : ఇటీవల కాలంలో పులులు జనావాసాల్లోకి వచ్చి జంతువులపై దాడులు చేయటం జరుగుతోంది. మేకలు, గొర్రెలు, బర్రెలు, ఆవులపై దాడులు చేస్తు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈక్రమంలో ఆత్మకూరులో అటువంటి ఘటన జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలోని ఆత్మకూరు మండలంలో ఆవుల మందపై పెద్దపులి దాడికి తెగబడింది. ఈ దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఎటునుంచి వచ్చి దాడి చేస్తోందోనని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని జీవిస్తుంది. తమ పశువులకు భద్రతతో పాటు తమ ప్రాణాల గురించి కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Washington Recruits Dogs And Cats: ఎలుకలను పట్టుకునేందుకు కుక్కలు, పిల్లుల నియామకం
ఆత్మకూరు మండలం పెద్ద అనంతాపురం గ్రామ శివారులో ఆవుల మందపై దాడి చేసింది పెద్దపులి. ఈ దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. అది చూసిన పశువులకాపరులు భయంతో పెద్ద పెద్దగా కేకలు వేశారు. పెద్దపులి దాడి నుంచి తమ పశువులను కాపాడుకోవటానికి పెద్దపెద్దగా అరిచారు. ఆ అరుపులకు పెద్దపులి పారిపోయింది. దీంతో పులి భయంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
గత కొంత కాలంగా అటవీ సమీప గ్రామాల్లో సంచరిస్తున్న పెద్దపులులు,చిరుతలు. జనారణ్యంలోకి వస్తున్నాయి. ఈ వేసవిలో ఎండలు ఠారెత్తిస్తుండటంతో అడవిలో నీరు లేక గ్రామాల బాట పడుతున్న వణ్య ప్రాణులు. నీటి కోసం జనారణ్యాలలోకి వచ్చిన క్రమంలో వాటికి కనిపించిన పశువులపై దాడికి దిగుతున్నాయి. పులుల భయంతో స్థానికులు ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులి సంచారంతో చుట్టూ ప్రక్కల రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామాల ప్రజలలో తీవ్ర కలవరం చెందుతున్నారు.