Srivari Sarvadarshanam : తిరుమలలో భక్తుల రద్దీ.. టోకెన్లు లేనివారికి 22 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం

మహా శివరాత్రి, వారాంతపు సెలవు దినాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది.

Tirumala Srivari

Srivari Sarvadarshanam : మహా శివరాత్రి, వారాంతపు సెలవు దినాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. తిరుమలలోని 24 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 22 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

నిన్న (శనివారం) 71,350 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 28,912 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.47 కోట్లు వచ్చిందని వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి తిరుపతిలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.

TTD : తిరుమలలో గరుడ పంచమి, ఎందుకు నిర్వహిస్తారు ?

ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ, ఏఈఓ గురుమూర్తి, కంకణ బట్టర్ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ ఇన్ స్పెక్టర్ కిరణ్ కూమార్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.