TTD : తిరుమలలో గరుడ పంచమి, ఎందుకు నిర్వహిస్తారు ?

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో గరుడ పంచమి నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం గరుడ పంచమి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి సంవత్సరం గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఏర్పాట్లు చేశారు

TTD : తిరుమలలో గరుడ పంచమి, ఎందుకు నిర్వహిస్తారు ?

Ttd

Updated On : August 13, 2021 / 8:39 AM IST

Garuda Panchami : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో గరుడ పంచమి (Garuda Panchami) నిర్వహించేందుకు టీటీడీ (TTD) అన్ని ఏర్పాట్లు చేసింది. 2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం గరుడ పంచమి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి సంవత్సరం గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా…శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్ప స్వామి వారిని ఆయనకు ఇష్టవాహనమైన ‘గరుడ వాహనం’పై తిరుమాడ వీధుల్లో ఊరేగించనున్నారు.

Read More : Lady Fingers: బెండ అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం

కోవిడ్ – 19 నియమాలు పాటిస్తూ…పరిమిత సంఖ్యలో భక్తులను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి టీటీడీ అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.  నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందంగా ఉండేందుకు, తమకు పుట్టే సంతానం గరుడినిలా బలంగా, మంచి వ్యక్తిత్వం గల వాడిగా ఉండాలని కోరుకుంటుంటారు. అందుకే గరుడ పంచమి పూజ చేస్తారు. ఇదిలా ఉంటే…ఆగస్టు నెలలో రెండుసార్లు గరుడ వాహన సేవ జరుగనుంది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే…పౌర్ణమి గరుడ సేవ జరుగనుంది.

Read More : Hyderabad : మీర్‌పేట్‌ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లపై దాడి ?

ఆగస్టు 22వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించనుంది టీటీడీ. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు వీధుల్లో ఊరేగనున్నారు. వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆధ్మాత్మకి భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇక్కడ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీలక్ష్మీనృసింహస్వామి వారికి కల్యాణోత్సవం జరుగనుంది.

Read More : Cargo Ship : సముద్రంలో రెండు ముక్కలైన కార్గో షిప్

శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు వస్తుంటాయనే సంగతి తెలిసిందే. అందులో గరుడ పంచమి కూడా ఒకటి. గరుత్మంతుడు సూర్యరథసారధి అయిన అనూరుడికి తమ్ముడు. సప్తసముద్రాల్లో ఉన్న జలాన్ని ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడని ప్రాశస్త్యం. గరుడినిలా బలంగా, మంచి వ్యక్తిత్వం గల వాడిగా ఉండాలని కోరుకుంటుంటారు.