Cargo Ship : సముద్రంలో రెండు ముక్కలైన కార్గో షిప్

ఉత్తర జపాన్ పోర్ట్ కి నుండి బయలుదేరిన పనామా దేశానికి చెందిన ఓ సరుకు ఓడ గురువారం తెల్లవారుజామున రెండు భాగాలుగా విరిగిపోయిందని జపాన్ కోస్ట్ గార్డ్ తెలిపింది.

Cargo Ship : సముద్రంలో రెండు ముక్కలైన కార్గో షిప్

Ship

Cargo Ship ఉత్తర జపాన్ పోర్ట్ కి నుండి బయలుదేరిన పనామా దేశానికి చెందిన ఓ సరుకు ఓడ గురువారం తెల్లవారుజామున రెండు భాగాలుగా విరిగిపోయిందని జపాన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. అయితే షిప్ లోని మొత్తం 21 మంది చైనీస్ మరియు ఫిలిపినో సిబ్బందిని కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించబడినట్లు ఈ షిప్ ఆపరేటర్ NYK లైన్(జపాన్ కంపెనీ) తెలిపింది.

39,910 టన్నుల బరువైన వుడ్ చిప్ ని క్యారీ చేస్తున్న క్రిమ్సన్ పోలరిస్(షిప్ పేరు)..హచినోహే పోర్టు నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. షిప్ తీరం నుండి 4 కిమీ (2.4 మైళ్ళు) దూసుకెళ్లిందని..అయితే షిప్ సముద్రగర్భంలో ముగినిపోకుండా తప్పించుకోగలిగిందని, కానీ పగుళ్లు ఏర్పడ్డాయని NYK లైన్ తెలిపింది. అయితే షిప్ రెండుగా విరిగిపోయిన నేపథ్యంలో అందులో నుంచి లీక్ అవుతున్న ఆయిల్ ని అదుపుచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు NYK లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.