తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత.. ఎందుకంటే?

సెప్టెంబ‌ర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవాచనం జరుపుతారు. తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలు ఏకాంతంగా జరుగుతాయి.

TTD Lunar eclipse 2025

Lunar eclipse 2025: చంద్రుడు ఎరుపు వర్ణంలో కనిపించనున్నాడు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? చంద్రగ్రహణం వల్ల ఏర్పడే ఈ దృశ్యాన్ని బ్లడ్ మూన్ అంటారు. వచ్చేనెల 7-8 రాత్రి సమయంలో బ్లడ్ మూన్ కనపడనుంది.

చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులకు స్వామివారి సేవలకు సంబంధించి అధికారులు కీలక సమాచారం ఇచ్చారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: అందరినీ మంత్రముగ్ధులను చేసే బ్లడ్ మూన్ వచ్చేస్తోంది.. ఆకాశంలో రెడ్‌ కలర్‌లో జాబిల్లి.. ఇది ఎందుకు ఇంత స్పెషల్?

సెప్టెంబర్ 7 సాయంత్రం 3.30 గంటల నుంచి సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు (12గంటల పాటు) శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 7న రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం కానుంది.

సెప్టెంబర్‌ 8న వేకువ‌జామున 1.31 గంటలకు వరకు కొనసాగనుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆనవాయితీగా ఆలయం తలుపులు మూసివేయనుంది టీటీడీ.

సెప్టెంబ‌ర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవాచనం జరుపుతారు. తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలు ఏకాంతంగా జరుగుతాయి.

సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారు. 7వ‌ తేదీన ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేశారు. ఆ రోజున తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూసివేస్తారు.