Visakha : తిరుమలకు వెళ్లలేని వారు..విశాఖకు వెళ్లండి, వెంకన్నను దర్శించుకోండి

సాగరతీరంలో శ్రీనివాసులు కొలువుదీరనున్నాడు. సర్వాంగ సుందరంగా నిర్మాణమైన ఆలయ ప్రాకారంలో ప్రతిష్ఠితం కానున్నాడు. ఎండాడ సర్వే నెంబర్‌ 20పీ, 191పీలో వెంకన్న ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది.

Ttd

Tirumala Venkanna : సాగరతీరంలో శ్రీనివాసులు కొలువుదీరనున్నాడు. సర్వాంగ సుందరంగా నిర్మాణమైన ఆలయ ప్రాకారంలో ప్రతిష్ఠితం కానున్నాడు. ఎండాడ సర్వే నెంబర్‌ 20పీ, 191పీలో వెంకన్న ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది. నిర్మాణానికయ్యే నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చింది. రూ. 28 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని.. తిరుమల ఆలయ నమూనాలో తీర్చిదిద్దారు.

Read More : Madhya Pradesh : ఆన్ లైన్‌‌లో 40 వేలు పొగొట్టుకున్న బాలుడు, మందలించడంతో ఉరేసుకున్నాడు

తిరుమలలో మాదిరిగానే పూజలు, సేవలు, ఇతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎంవీపీ కాలనీలో టీటీడీ కల్యాణ మండపం.. దానికి ఎదురుగా టీటీడీ ఈ-దర్శనం కౌంటర్‌ ఉన్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆలయ పనులు పూర్తవడంతో.. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది శ్రీవారి ఆలయం. ఈ నెల 13వ తేదిన సీఎం చేతులు మీదుగా ఆలయం ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచే వేంకటేశ్వరుని దివ్యదర్శనం, స్వామి సేవలతో పాటు లడ్డూలు అందుబాటులోకి వస్తాయి.

Read More :CBSE : ఫలితాల్లో సత్తాచాటిన ముద్దుగుమ్మ

తిరుమల వెళ్లలేనివారు.. విశాఖలోనే శ్రీవారిని దర్శించుకోవచ్చు. ప్రసాదాలు, ప్రత్యేక పూజులు చేయించుకోవచ్చు. తిరుమలలో ఎలాగైతే.. నిత్యపూజలు నిర్వహిస్తారో.. ఇక్కడ కూడా అలాంటి సేవలు నిర్వహించనుంది టీటీడీ. మెుత్తంగా తిరుమల వెంకన్న విశాఖలోనే దర్శనం ఇవ్వనుండటంతో.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు భక్తులు.