Tirupati
Tirupathi Formation Day: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న.. తిరుమల కొండ కింద, ఏడుకొండల వాడి పాదాల చెంత వొదిగియున్న తిరుపతి నగరం.. నేడు 892వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. తిరుపతిలోని పలు చారిత్రక కట్టడాలను, ప్రభుత్వ కార్యాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, మునిసిపల్ కమిషనర్ గిరీషా ఇతర ప్రభుత్వ అధికారులు స్థానిక నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Also read: Amaravati Farmers: 800రోజులకు చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం
తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని గోవిందరాజస్వామి ఆలయంలోని రామానుజ విగ్రహం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి నగరానికి పునాది వేసిన రామానుజాచార్యులను తలచుకుంటూ నగర వాసులకు శుభాకంక్షాలు తెలిపారు. అనంతరం రామానుజాచార్యుల చిత్రపటాలు చేతపట్టి తిరుపతి నగర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన తిరుపతి నగరం ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. రామానుజాచార్యుల చేతుల మీదుగా నాడు తిరుపతికి శంకుస్థాపన జరుగగా.. తొలుత గోవిందరాజ పురం, తర్వాత రామానుజ పురం..చివరకు తిరుపతిగా పేరు మార్పు చెందింది.
Also read: Medaram Jathara: మేడారం సమ్మక్క-సారక్క జాతర.. హుండీ లెక్కింపు ప్రారంభం