Amaravati Farmers: 800రోజులకు చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం

అమరావతినే రాజధానిగా సాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 800వ రోజుకు చేరుకుంది.

Amaravati Farmers: 800రోజులకు చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం

Chandrababu

Updated On : February 24, 2022 / 10:52 AM IST

Amaravati Farmers Protest Reaches 800 Days: అమరావతినే రాజధానిగా సాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 800వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాళ(24 ఫిబ్రవరి 2022) వెలగపూడిలో రైతులు అమరావతి ప్రజా దీక్ష చేస్తున్నారు.

అమరావతి ఉద్యమం 800వ రోజుకు చేరుకున్న సంధర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మూడు ముక్కల రాజధాని ప్రతిపాదనలను పూర్తిగా పక్కన పెట్టి అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అలుపెరుగక 800 రోజుల రాజధాని పోరాటం చేస్తున్నవారిని అభినందించారు. మీ ఉద్యమానికి, పోరాటానికి టీడీపీ ఎప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద కక్షను పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నామని అన్నారు.

తన మూర్ఖపు వైఖరితో రాష్ట్రంలో లక్షల కోట్ల సంపదను సృష్టించే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసిన జగన్ తప్పులను చరిత్ర ఎప్పటికీ క్షమించదన్నారు. రాజ‌ధాని ప్రాంతం స్మశానం అన్న వాళ్లే అమరావతి భూముల‌ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారని అన్నారు.