Tirupati : నెరవేరబోతున్న తిరుపతి నగర వాసుల కల

TTD కేవలం 75 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం బస్టాండ్ నుంచి అలిపిరి వరకు ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత కడప మార్గం నుంచి తిరుపతి నగరంతో...

Tirupati Garuda Varadhi  : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తిరుపతి నగరవాసుల కల నెరవేరబోతుంది. నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా.. శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొండపైకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. TTD, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ఫ్లైఓవర్ గరుడ వారధి వారం, పదిరోజుల్లో అందుబాటులోకి రానుంది. సుమారు 648 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ భారీ ఫ్లైఓవర్‌లో మొదటి ఫేజ్ పూర్తి దాదాపు కావొచ్చింది. మొత్తం 6 కిలోమీటర్ల మేర ఈ భారీ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు.

Read More : Malavika : ‘పుష్ప’ ఐటెం సాంగ్ ఆఫర్ వస్తే చేస్తా అంటున్న సీనియర్ హీరోయిన్

మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం.. చివరికి మొదటి ఫేజ్‌ను పూర్తి చేసుకుంది. ఫ్లై ఓవర్ నిర్మాణ ఖర్చులో.. TTD 67 శాతం భరించగా తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల నుంచి 33 శాతం కేటాయిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో.. ఇప్పటివరకు TTD కేవలం 75 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం బస్టాండ్ నుంచి అలిపిరి వరకు ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత కడప మార్గం నుంచి తిరుపతి నగరంతో సంబంధం లేకుండా మరో కనెక్షన్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఆఫ్కాన్ సంస్థ ప్రయత్నిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు