Tirupati, Nagarjuna Sagar : ఎన్నికల సందడి : తిరుపతి, సాగర్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మళ్లీ ప్రారంభమైంది. తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ, ఏపీలోని తిరుపతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ఉప ఎన్నికలకు 2021, మార్చి 23వ తేదీ మంగళవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు.

Election Nomination : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మళ్లీ ప్రారంభమైంది. తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ, ఏపీలోని తిరుపతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ఉప ఎన్నికలకు 2021, మార్చి 23వ తేదీ మంగళవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు నిర్వహించి… మే 2న కౌంటింగ్‌ నిర్వహిస్తారు.

నాగార్జున సాగర్ : –
నాగార్జున సాగర్‌ ఉపఎన్నికకు TRS, BJP ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ ఇప్పటికే సీనియర్ నేత జానారెడ్డి పేరును ఖరారు చేసింది. ఆయన ఈనెల 30న నామినేషన్‌ వేసేందుకు రెడీ అవుతున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, రంజిత్ యాదవ్, గురవయ్య యాదవ్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. BJP నుంచి ఎవరు పోటీ చేస్తారనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. TRS తన అభ్యర్థిని ప్రకటించాకే BJP అభ్యర్థిని వెల్లడించే అవకాశం ఉంది.

తిరుపతి : –
తిరుపతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ఉపపోరుకు BJP మినహా ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించాయి. అక్కడ వచ్చే రిజల్ట్‌ దేశమంతా మారుమోగాలని నేతలకు ఇప్పటికే సూచించారు సీఎం జగన్‌. YCP అభ్యర్థిగా గురుమూర్తి బరిలో ఉన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన టీడీపీ.. తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. పనబాకలక్ష్మి పేరును ఆ పార్టీ ఎప్పుడో ఖరారు చేసింది. ఇక, బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. తిరుపతిలో బీజేపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు