×
Ad

పరకామణి, కల్తీ నెయ్యి, పట్టు శాలువాలు, గోవిందరాజు స్వామి టెంపుల్.. ఈ ఏడాదంతా తిరుపతి చుట్టే ఇలా..!

లేటెస్ట్‌ వ్యవహారంపై మరోసారి తిరుమల శ్రీవారి సెంట్రిక్‌గా తీవ్ర దుమారం నడుస్తోంది. గోవిందరాజస్వామి ఆలయ గోపుర తాపడం కోసం కేటాయించిన బంగారంలో గోల్‌మాల్‌ జరిగిందన్న ప్రచారం పొలిటికల్‌ కాంట్రవర్సీ అవుతోంది.

Tirupati

Tirupati: ఏడుకొండల వాడు, వడ్డీకాసుల వాడు..కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో..నిత్యం ఏదో ఒక ఇష్యూ సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి చోరీ ఎపిసోడ్‌ కొండంత వివాదంగా ఉండగా..ఈ మధ్యే పట్టు శాలువాల స్కామ్‌ అంటూ దుమారం లేచింది. ఈ ఇష్యూ అలా చల్లారిందో లేదో..ఇప్పుడు ఇంకో వివాదం వెలుగులోకి వచ్చింది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది.

గోవిందరాజస్వామి ఆలయంలో 50 కిలోల బంగారం మాయం చేశారన్న ప్రచారం సెన్సేషనల్ అవుతోంది. విమాన గోపురం బంగారం తాపడం పనులకు గత ప్రభుత్వం 100 కిలోల బంగారం కేటాయించగా..అందులో 50 కేజీల గోల్డ్‌ను మాయం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. 9 లేయర్లతో బంగారం తాపడం వేయాల్సి ఉండగా 2 లేయర్లే వేశారన్న టాక్ వినిపిస్తోంది.

అంతేకాకుండా బంగారం తాపడం పనులు అసలు కాంట్రాక్టర్ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్వహించారన్న చర్చ జరుగుతోంది. ఆలయ గోపురంపై అప్పట్లో 30పైగా విగ్రహాలు ధ్వంసం చేసి బంగారం తాపడం పనులు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అవకతవకలపై చాలా సీక్రెట్‌గా విజిలెన్స్ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: ధురంధర్ హిట్‌.. డాన్ 3 నుంచి రణ్‌వీర్ సింగ్ ఔట్! ఏం జరుగుతోంది?

లేటెస్ట్‌ వ్యవహారంపై మరోసారి తిరుమల శ్రీవారి సెంట్రిక్‌గా తీవ్ర దుమారం నడుస్తోంది. గోవిందరాజస్వామి ఆలయ గోపుర తాపడం కోసం కేటాయించిన బంగారంలో గోల్‌మాల్‌ జరిగిందన్న ప్రచారం పొలిటికల్‌ కాంట్రవర్సీ అవుతోంది. ఇప్పటికే కల్తీ నెయ్యి ఎపిసోడ్‌ నేషనల్ టాపిక్ అయింది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి..హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేసింది. ఆ తర్వాత పాత ఇష్యూ పరకామణి చోరీ కేసు కలకలం సృష్టించింది. ఫిర్యాదుదారుడు, సాక్షిగా ఉన్న ఆఫీసర్ అనుమానాస్పద మృతి చెందడంతో కూటమి వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్‌కు దారితీసింది.

ఇక శ్రీవారి పట్టువస్త్రాల స్కామ్‌ కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు గోవిందరాజస్వామి ఆలయ తాపడం వ్యవహారంతో మరోసారి తిరుమల చుట్టే చర్చ జరుగుతోంది. ఏడాది కాలంలోనే నాలుగు అంశాలు శ్రీవారి భక్తుల మనసును గాయపరిచాయి. కల్తీ నెయ్యి, పరకామణి కేసులో వైసీపీ నేతలు, అప్పటి టీటీడీ ఈవోలు అలిగేషన్స్ ఫేస్ చేస్తున్నారు. పట్టు శాలువాల వ్యవహారంలో విజిలెన్స్ దర్యాప్తు ఉత్కంఠ రేపుతోంది. గోవిందరాజ స్వామి ఆలయ గోపురం తాపడం తయారీలో..50 కిలోల బంగారం చోరీ అయినట్లు ప్రచారం జరుగుతుండటం సంచలనం సృష్టిస్తోంది.

అయితే గత ప్రభుత్వంలో తిరుమలలో జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటి బయటికి తీస్తున్నామని కూటమి పెద్దలు చెప్తుంటే..ప్రతీదానికి వైసీపీకి లింకు పెట్టే కుట్ర చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ లీడర్లు రివర్స్ అటాక్ చేస్తున్నారు. తమను హిందూ వ్యతిరేకులుగా చూపించి..లబ్ధి పొందే ప్రయత్నమే తప్ప..అసలు వాస్తవాలేంటో తేల్చడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటున్నారు వైసీపీ నేతలు. రూమర్స్, గాలి ప్రచారమే తప్ప..ఎక్కడా తప్పు జరిగినట్లు ప్రూవ్ చేయలేదని..ఏడాది కాలంలో కూటమి సర్కార్‌ గోబెల్స్ ప్రచారంతో నెట్టుకొస్తుందని ఫ్యాన్ పార్టీ లీడర్లు విమర్శిస్తున్నారు.

ఇలా కల్తీ నెయ్యి, పరకామణి చోరీ కేసు, పట్టు శాలువాల స్కామ్..ఇప్పుడు గోవిందరాజస్వామి బంగారం ఇష్యూపై..పొలిటికల్ వార్ నడుస్తుంది. మరోవైపు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్‌ వైడ్‌గా ఎంతో పేరు ప్రతిష్టలు.. అన్నింటికి మించి కోట్లాది మంది భక్తుల విశ్వాసంగా ఉన్న శ్రీవారి సన్నిధిలో వరుస సంఘటనలు కలకలం రేపుతున్నాయి. గోవిందరాజస్వామి ఆలయ గోపురం బంగారం వ్యవహారం..ఎటు టర్న్ తీసుకుంటుందో..ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందో వేచి చూడాలి.