Tollywood Producers : మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు భేటీ

ఏపీలో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు భేటీ అయ్యారు. ఇప్పటికే మంత్రితో సినిమా రంగ దిగ్గజాలు భేటీ అయ్యారు.

Cinema

producers meets minister Perni Nani : ఆంధ్రప్రదేశ్ లో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు భేటీ అయ్యారు. నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్, వంశీరెడ్డి, మైత్రి నవీన్ కలిసి మచిలీపట్నం వెళ్లారు. అక్కడ మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యారు. ఆన్ లైన్ టికెట్ల అమ్మకంతోపాటు సినీ ఇండస్ట్రీలో సమస్యలపై మంత్రితో చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో నిర్మాతల బృందం వెళ్లి పేర్నినానిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో సినిమా నిర్మాతలు మంత్రితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమా టిక్కెట్ల నేపథ్యంలో ఇప్పటికే మంత్రితో సినీ రంగ దిగ్గజాలు సమావేశమయ్యారు.

సెప్టెంబర్ 20న ఏపీ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులు మంత్రి పేర్నినానితో చర్చలు జరిపారు. టాలీవుడ్‌ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై చర్చించారు. వీలైనంత త్వరగా పరిష్కారం చూపించాలని కోరారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలను అడిగి తెలుసుకున్న మంత్రి పేర్ని నాని… త్వరలోనే సీఎం జగన్‌తో చర్చించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే మరోసారి టాలీవుడ్‌ ప్రతినిధులతో సమావేశం అవుతానని చెప్పారు. ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారంపై కూడా సమావేశంలో చర్చించారు. త్వరలోనే ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని మంత్రి పేర్నినాని చెప్పారు. పారదర్శకతతో కూడిన రేట్లను అమలు చేస్తామని… ప్రభుత్వ నిర్దేశించిన ధరల్ని మాత్రమే థియేటర్‌లో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. చట్టాలకు అతీతంగా వ్యాపారాలు చేసే పరిస్థితి రాకూడదన్నారు మంత్రి పేర్ని నాని.

Film Industry : ఏపీలో సినిమా కష్టాలు కొలిక్కి వచ్చాయా?

సమస్యల్లో ఉన్న సినీ ఇండస్ట్రీని ఆదుకోవాలంటూ మెగాస్టార్‌ చిరంజీవి చేసిన విజ్ఞప్తికి మంత్రి పేర్ని నాని సానుకూలంగా స్పందించారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు గౌరవం ఉందని… సోదరభావంతో చూస్తారని చెప్పారు. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు ఫలప్రదం అయ్యాయన్నారు నిర్మాత సీ. కల్యాణ్. ఆన్‌లైన్ టికెటింగ్ కావాలని అడిగామన్నారు. ఏపీ ప్రభుత్వం తమకు భరోసా కల్పించిందన్నారు కల్యాణ్. ఇండస్ట్రీకి మేలు చేసే నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారని నిర్మాత ఆదిశేషగిరి రావు అన్నారు. థియేటర్ యజమానుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారన్నారు. మొత్తానికి సినిమా సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుండటంతో.. సినిమా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన స్పీచ్ అటు పరిశ్రమలోనూ, ఇటు రాజకీయాల్లోనూ సంచలనం సృష్టిస్తుంది. దీనిపై వైసీపీ వాళ్లు జనసేన వాళ్ళు ఒకరి పై ఒకరు విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. దీనిపై పరిశ్రమలో కూడా విమర్శలు వస్తున్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదని అధికారికంగానే ప్రకటించింది. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో హాట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ విచ్చేశారు. ఈ సందర్బంగా పవన్, సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తేజ్ ఇంకా కళ్ళు తెరవలేదని, ప్రస్తుతం బెడ్ పైనే ఉన్నానని తెలిపారు. తేజ్ ఆసుపత్రిలో ఉండటంతో తానూ ఈ ఈవెంట్ కి వచ్చినట్లు వివరించారు.

Pawan Kalyan : సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందులు క‌లిగిస్తే తాట తీస్తా – పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక

ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ అనేక అంశాలపై మాట్లాడారు. సినిమా టికెట్లు, తేజ్ రోడ్డు ప్రమాదం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మాట్లాడుతూ అధికార వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇక ఇదే సమయంలో రాజకీయాలపై మాట్లాడారు.. రాను రాను రాకకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని అన్నారు.

సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం విషయంపై పెట్టినంత దృష్టి వివేకానంద రెడ్డి హత్యకేసుపై పెట్టి ఉంటే బాగుండేదని పవన్ అన్నారు. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు మీరు మాట్లాడాల్సింది.. కోడి కత్తిమీద, ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన అత్యాచారం మీద మాట్లాడాలన్నారు. సినిమా నటులపై విమర్శలు మాని కాపు రిజర్వేషన్, పులివెందుల గురించి రాసే దమ్ము మీకుందా అంటూ సవాల్ విసిరారు.