Film Industry : ఏపీలో సినిమా కష్టాలు కొలిక్కి వచ్చాయా?

ఏపీ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులు మంత్రి పేర్నినానితో చర్చలు జరిపారు. టాలీవుడ్‌ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై చర్చించారు.

Film Industry : ఏపీలో సినిమా కష్టాలు కొలిక్కి వచ్చాయా?

Cinema

ap minister perni nani : ఏపీలో సినిమా కష్టాలు కొలిక్కి వచ్చాయా? మంత్రి పేర్నినానితో సినీ ఎగ్జిబిటర్ల సమావేశంలో ఏం తేల్చారు.? సినీ ప్రతినిధుల విజ్ఞప్తులపై మంత్రి పేర్నినాని స్పందనేంటి.? ఇంతకీ తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ఏపీ సర్కార్‌తో చర్చలు ఫలించాయా?

ఏపీ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులు మంత్రి పేర్నినానితో చర్చలు జరిపారు. టాలీవుడ్‌ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై చర్చించారు. వీలైనంత త్వరగా పరిష్కారం చూపించాలని కోరారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలను అడిగి తెలుసుకున్న మంత్రి పేర్ని నాని… త్వరలోనే సీఎం జగన్‌తో చర్చించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే మరోసారి టాలీవుడ్‌ ప్రతినిధులతో సమావేశం అవుతానని చెప్పారు.

Charge Sheet: డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్!

ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారంపై కూడా సమావేశంలో చర్చించారు. త్వరలోనే ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని మంత్రి పేర్నినాని చెప్పారు. పారదర్శకతతో కూడిన రేట్లను అమలు చేస్తామని… ప్రభుత్వ నిర్దేశించిన ధరల్ని మాత్రమే థియేటర్‌లో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. చట్టాలకు అతీతంగా వ్యాపారాలు చేసే పరిస్థితి రాకూడదన్నారు మంత్రి పేర్ని నాని.

సమస్యల్లో ఉన్న సినీ ఇండస్ట్రీని ఆదుకోవాలంటూ మెగాస్టార్‌ చిరంజీవి చేసిన విజ్ఞప్తికి మంత్రి పేర్ని నాని సానుకూలంగా స్పందించారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు గౌరవం ఉందని… సోదరభావంతో చూస్తారని చెప్పారు. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు.

Tollywood : శుక్రవారం రెండు తెలుగు సినిమాలు రిలీజ్

సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు ఫలప్రదం అయ్యాయన్నారు నిర్మాత సీ. కల్యాణ్. ఆన్‌లైన్ టికెటింగ్ కావాలని అడిగామన్నారు. ఏపీ ప్రభుత్వం తమకు భరోసా కల్పించిందన్నారు కల్యాణ్. ఇండస్ట్రీకి మేలు చేసే నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారని నిర్మాత ఆదిశేషగిరి రావు అన్నారు.

థియేటర్ యజమానుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారన్నారు. మొత్తానికి సినిమా సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుండటంతో.. సినిమా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.