Stored And Rotten Chicken, Mutton : విజయవాడలో నిల్వ ఉంచిన, కుళ్లిన చికెన్‌-మటన్‌ అమ్ముతున్న వ్యాపారులు

విజయవాడలో చికెన్‌, మటన్‌ మాఫియా రెచ్చిపోతోంది. నిల్వ ఉంచిన, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తోంది. ప్రజారోగ్యానికి హాని చేసేలా మాంసం విక్రయాలపై వీఎంసీ వెటర్నరీ అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. వీఎంసీ వెటర్నరీ డాక్టర్‌ రవిచంద్‌ ఆధ్వర్యంలో దాడులు చేశారు.

Stored And Rotten Chicken, Mutton : విజయవాడలో చికెన్‌, మటన్‌ మాఫియా రెచ్చిపోతోంది. నిల్వ ఉంచిన, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తోంది. ప్రజారోగ్యానికి హాని చేసేలా మాంసం విక్రయాలపై వీఎంసీ వెటర్నరీ అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. వీఎంసీ వెటర్నరీ డాక్టర్‌ రవిచంద్‌ ఆధ్వర్యంలో దాడులు చేశారు. పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు మాంసం దుకాణాల్లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు.

పలు దుకాణాల్లో కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసాన్ని వీఎంసీ అధికారులు గుర్తించారు. దుర్గపురం మార్కెట్‌, మాచవరం, వన్‌టౌన్ మార్కెట్లలో అనారోగ్యంతో చనిపోయిన గొర్రెల మాంసం అమ్ముతున్నట్లు గుర్తించారు. కుళ్లిన మాంసాన్ని నాశనం చేశారు. వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఐస్‌ బాక్స్‌లలో నిల్వ ఉంచిన మాంసాన్ని సీజ్‌ చేశారు.

Vijayawada Mutton: బెజవాడలో బయటపడ్డ కుళ్లిన మాంసం దందా

నిల్వ, కుళ్లిన మాంసం తింటే ఆరోగ్యానికి హానికరమని డాక్టర్ కృష్ణదాస్‌ అన్నారు. ఐస్‌లో నిల్వ ఉంచిన మాంసం, కుళ్లిన మాంసం తింటే జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. కుళ్లిన మాంసంలో బ్యాక్టీరియా, ఫంగస్‌ ఉంటుందన్నారు. కుళ్లిన మాంసం తింటే శరీరంలో బ్లడ్ ఇన్‌ఫెక్షన్‌ వస్తుందని తెలిపారు. ఆ మాంసం తింటే శరీరంలోని అవయవాల పని తీరుపై ప్రభావం పడుతుందన్నారు.

బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో అవయవాలు దెబ్బతింటాయని చెప్పారు. లివర్‌, కిడ్నీ పని తీరు దెబ్బతింటాయని చెప్పారు. రక్తంలో ఇన్‌ఫెక్షన్‌తో జ్వరం, తలనొప్పి వస్తాయని పేర్కొన్నారు. తాజా మాంసాన్ని తినకపోతే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లేనని అంటున్నారు. తాజా మాంసం కొనుగోలు చేయాలని వైద్యులు చెబుతున్నారు.

Rotten Meat : బాబోయ్.. విజయవాడలో ఘోరం.. కుళ్లిన మాంసం విక్రయం.. 150కిలోలు సీజ్

ఫ్రెష్‌ మీట్‌ రెడ్‌ కలర్‌లో ఉంటుందన్నారు. నిల్వ మాంసం వాసన వస్తుందని చెప్పారు. నిల్వ మాంసంలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్‌తో అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. నిల్వ మాంసం ఒక్కసారి తిన్నా ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు