Rotten Meat : బాబోయ్.. విజయవాడలో ఘోరం.. కుళ్లిన మాంసం విక్రయం.. 150కిలోలు సీజ్

విజయవాడలో ఘోరం వెలుగుచూసింది. కాసుల కక్కుర్తితో ఓ వ్యాపారి దారుణానికి ఒడిగట్టాడు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాడు. కుళ్లిన మాంసాన్ని ఫ్రిజ్ లో నిల్వ ఉంచి దాన్నే విక్రయిస్తున్నాడు.

Rotten Meat : బాబోయ్.. విజయవాడలో ఘోరం.. కుళ్లిన మాంసం విక్రయం.. 150కిలోలు సీజ్

Rotten Meat

Rotten Meat : విజయవాడలో ఘోరం వెలుగుచూసింది. కాసుల కక్కుర్తితో ఓ వ్యాపారి దారుణానికి ఒడిగట్టాడు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాడు. కుళ్లిన మాంసాన్ని ఫ్రిజ్ లో నిల్వ ఉంచి దాన్నే విక్రయిస్తున్నాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

గుట్టు చప్పుడు కాకుండా నిల్వ చేసిన మాంసాన్ని విక్రయిస్తున్న వారిపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేయగా.. భారీగా కుళ్లిన మాంసం నిల్వలు గుర్తించారు అధికారులు.

కొన్నిరోజుల నుంచి కృష్ణలంకలోని భూపేష్ నగర్ లో రాము అనే వ్యాపారి నిల్వ ఉంచిన మేకలు, పొట్టేళ్ల మాంసాన్ని విక్రయిస్తున్నట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దాడులు చేశారు.

Sidhu Moose Wala: సిద్ధూ హంతకుడు అరెస్టు.. వయస్సు 19 ఏళ్లే!

రాము.. నిల్వ చేసిన మాంసంతో వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. వ్యాపారి రాము ఏకంగా 150 కేజీల కుళ్లిన మాంసాన్ని ఫ్రిజ్ లో నిల్వ ఉంచాడు. ఆ మాంసం బాగా దుర్వాసన వెదజల్లుతోంది. వీఎంసీ అధికారులు ఆ మాంసాన్ని సీజ్ చేశారు. గతంలో కూడా రాము ఇలానే కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ రవిచంద్ తెలిపారు.

రాము.. వినుకొండలో చనిపోయిన గొర్రెలను, మేకలను తీసుకొస్తాడని చెప్పారు. కబేళాకు వెళ్లకుండా ఇంట్లోనే వాటిని కోసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తాడని చెప్పారు. అంతేకాకుండా కొంత మాంసాన్ని హోల్ సేల్ ధరలతో షాపులకు కూడా అమ్ముతున్నాడని వెల్లడించారు. ఇలాంటి మాంసం తింటే అనేక రోగాలు వస్తాయని అధికారులు హెచ్చరించారు. కుళ్లిన మాంసంతో వ్యాపారం చేస్తున్న వ్యాపారిపై అధికారులు కేసు నమోదు చేశారు.

Dhoom-Style Robbery : సినీ ఫక్కీలో చోరీ-చేతనైతే పట్టుకోండని సవాల్

కుళ్లిన, దుర్వాసన వస్తున్న మాంసాన్ని ఫ్రిజ్ లో నిల్వ ఉంచి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలిసి మాంసం ప్రియులు షాక్ కి గురవుతున్నారు. ఇన్నాళ్లు తాము తిన్న మాంసం మంచిదో కాదో అనే అనుమానం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డబ్బు ఆశతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే ఇలాంటి వ్యాపారులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా అధికారులు నిఘా పెంచాలంటున్నారు.