Dhoom-Style Robbery : సినీ ఫక్కీలో చోరీ-చేతనైతే పట్టుకోండని సవాల్

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన ధూమ్ సినిమా ఇన్పిరేషన్‌తో కొందరు దొంగలు స్కూల్లోని కంప్యూటర్లు, ప్రింటర్, ఎత్తుకుపోయారు.

Dhoom-Style Robbery : సినీ ఫక్కీలో చోరీ-చేతనైతే పట్టుకోండని సవాల్

Odisha School Theft

Dhoom-Style Robbery :  బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన ధూమ్ సినిమా ఇన్పిరేషన్‌తో కొందరు దొంగలు స్కూల్లోని కంప్యూటర్లు, ప్రింటర్, ఎత్తుకుపోయారు. దొంగతనం చేసి వెళుతూ మేము మళ్లీవస్తాం… చేతనైతే పట్టుకోండి అంటూ సవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు బ్లాక్ బోర్డు మీద కొన్ని ఫోన్ నెంబర్లు రాసి మరీ వెళ్లారు.

ఒడిషాలోని నవరంగ్ పూర్ జిల్లాలోని ఖతీగూడలో ఉన్న ఇంద్రావతి హైస్కూలులో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. స్కూల్ హెడ్‌మాస్టర్ గదిలోని కంప్యూటర్లు, జిరాక్స్ మెషీన్, ప్రింటర్లు, ఫోటో కాపీయర్సు, వేయింగ్ మెషీన్లు ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా మీకు చేతనైతే మమ్మల్ని పట్టుకోండి అంటూ సవాల్  విసిరి కొన్ని ఫోన్‌ నంబర్ల్‌ను ఓ తరగతి గదిలోని బోర్డుపై రాశారు. దాంతోపాటు ధూమ్‌ 4 తొందర్లో వస్తుందని రాసి వెళ్లారు.

Odisha School Theft 2

శనివారం ఉదయం స్కూల్‌కి వచ్చిన ప్యూన్‌..హెడ్‌మాస్టర్‌ రూమ్‌ డోర్‌  తెరిచి ఉండటాన్ని గమనించాడు. అందులో వస్తువులు మాయమైపోవడాన్ని గుర్తించి యాజమాన్యానికి తెలిపాడు. దీంతో స్కూల్‌ హెచ్‌ఎం సర్వేశ్వర్‌ బెహెరా స్కూలుకు వచ్చి చోరీ జరిగిన విషయం ధృవీకరించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జూన్ 30న స్కూలులో ఇద్దరు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారని, వారికోసం జూన్ 30 రాత్రి వీడ్కోలు సభ ఏర్పాటు చేశామని బెహరా చెప్పారు. ఆ ఫంక్షన్‌లో ఉపయోగించిన కొన్ని సంగీత వాయిద్య పరికరాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లారని ఆయన తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దుండగులు రాసిన ఫోన్ నెంబర్లలో ఒకటి ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి చెందినది. అయితే దొంగలు తన నెంబరు ఎందుకు రాసారో అర్ధం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read : Maharashtra: అవును మాది ‘ఈడీ’ ప్ర‌భుత్వమే: దేవేంద్ర ఫ‌డ్న‌వీస్