×
Ad

Banni Utsavam: కర్రల సమరంలో ఇద్దరి మృతి.. మరో 100 మందికి గాయాలు

దేవతామూర్తుల విగ్రహాలను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు తలపడ్డాయి.

Devaragattu Banni Utsavam

Banni Utsavam: దసరా వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం, దేవరగట్టులో ప్రతి ఏడాది బన్ని ఉత్సవం (దేవరగట్టు కర్రల సమరం) నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర సమయంలో హింస చెలరేగి, రెండు వర్గాల వారు కర్రలతో తలపడ్డారు.

Also Read: భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్.. వరద ముప్పుపై ఏపీ సర్కారు అప్రమత్తం.. కీలక సూచనలు

దీంతో ఇద్దరు మృతి చెందగా, మరో 100 మందికి గాయాలయ్యాయి. గత అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహ కార్యక్రమం తర్వాత ఊరేగింపు జరిగిన సమయంలో దేవతామూర్తుల విగ్రహాలను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు తలపడ్డాయి. కర్రలతో దాడులు చేసుకున్నాయి. గాయపడిన వారికి ఆదోని ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.

ప్రతి ఏడాది బన్ని ఉత్సవంలో ఇలా హింస చెలరేగుతుంది. అవాంచనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు వేసుకుంటున్నప్పటికీ హింస ఆగడం లేదు. నిన్న ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. అక్కడి పరిసరాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.

ఇక్కడ కర్రల సమరం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. దేవతలు రాక్షస సంహారం చేశాక దేవతామూర్తులను గ్రామస్థులు స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో ఈ ఆనవాయితీ ప్రారంభమైందని నమ్ముతారు. ఆధునిక కాలంలోనూ ఈ కర్రల సమరం కొనసాగుతోంది.