కరోనా వైరస్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఎదిగొచ్చిన కొడుకులు ముగ్గురు పెళ్లి చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారనుకుంటే అందులో ఇద్దరికి కరోనా సోకగా మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదగాధ గుంటూరు జిల్లాలో జరిగింది.
టీ స్టాల్ నడుపుకుంటున్న అతని మరో సోదరుడితో పాటు వారి కుటుంబ సభ్యులు నలుగురిని గుంటూరు ఆస్పత్రిలో ఐసోలేషన్ లో ఉంచారు. ఆ సోదరుడు గుండెపోటుతో మరణించాడు. మృతదేహా తీసుకునేందుకు స్ధానికంగా ఎవరూ లేకపోవటంతో అక్కడే ఖననం చేశారు.
ఈవిషాదం మరువక ముందే రిమ్స్ లో చికిత్స పొందుతున్నల్యాబ్ టెక్నీషియన్ మరణించాడు. అక్కడే చికిత్స పొందుతున్న మరో సోదరుడు ఇంకా కోలుకోలేదు. ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరు తక్కువకాలంలో మృత్యువాత పడటంతో కన్నవారికి అంతులేని బాధను మిగిల్చింది. కరోనా కారణంతో అయినవారు కూడా కడసారి చూపు చూసుకోలేకపోయారు.