×
Ad

ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద త్రుటిలో తప్పిన రైలు ప్రమాదం.. హౌరా ఎక్స్‌ప్రెస్‌ను గమనించి వారందరూ బిగ్గరగా కేకలు..

అప్పటికే అక్కడ అరగంట నుంచి వెయిట్ చేస్తున్న వాహనదారులు ఒక్కసారిగా రైల్వే ట్రాక్ మీదకి వచ్చారు. గేట్‌కి సమీపంలోకి హౌరాఎక్స్‌ప్రెస్‌ వచ్చింది.

Ongole: ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద ఇవాళ రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. చెన్నై నుంచి హౌరా వెళ్తున్న “హౌరా ఎక్స్‌ప్రెస్” ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ఆగాల్సి ఉంది. హౌరా రైలు అగ్రహారం రైల్వే గేట్ సమీపంలోకి వచ్చినప్పటికీ దాన్ని గమనించకుండా గేట్‌మన్ గేటును ఓపెన్ చేశాడు.

అప్పటికే అక్కడ అరగంట నుంచి వెయిట్ చేస్తున్న వాహనదారులు ఒక్కసారిగా రైల్వే ట్రాక్ మీదకి వచ్చారు. గేట్‌కి సమీపంలోకి హౌరాఎక్స్‌ప్రెస్‌ వచ్చింది. దీంతో వాహనదారులు పెద్దగా కేకలు వేయడాన్ని గమనించిన లోకో పైలట్ సడెన్‌గా రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది.

Also Read: సల్మాన్‌ ఖాన్‌ను ‘ఉగ్రవాది’గా ప్రకటించిన పాకిస్థాన్‌.. ఇప్పుడు ఏం జరుగుతుంది?

ట్రైన్ వస్తున్నప్పటికీ గమనించకుండా రూములో కూర్చొని గేట్లు ఓపెన్ చేసిన గేట్‌మన్‌.. వాహనదారులు పెద్దగా వేసిన తర్వాత బయటికి వచ్చి హడావుడిగా అప్పుడు గేట్లు వేశాడు.

ఒంగోలులో ఆగాల్సిన హౌరా ఎక్స్‌ప్రెస్‌ గేటు వద్దకు వచ్చినప్పటికీ రైల్ గేటు లాక్ ఇచ్చిన ఒంగోలు స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనపడింది. రైల్వే ఉన్నతాధికారులు ఈ ఇద్దరిపై చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రయాణికులు అన్నారు.