Vizianagaram Train Accident : 14కు చేరిన మృతుల సంఖ్య,100 మందికి పైగా గాయాలు,12 రైళ్లు రద్దు

విజయనగరం రైలు ప్రమాదం తర్వాత 12 రైళ్లను రద్దు చేశారు. విశాఖపట్టణం మార్గంలో పలు రైళ్లను దారి మళ్లించారు. ప్రమాదానికి గురైన రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని బస్సుల్లో తరలించామని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు చెప్పారు....

Vizianagaram Train Accident

Vizianagaram Train Accident : విజయనగరం రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో  100కు పైగా ప్రయాణికులు గాయపడ్డారు.  విజయనగరం రైలు ప్రమాదం తర్వాత 12 రైళ్లను రద్దు చేశారు. విశాఖపట్టణం మార్గంలో పలు రైళ్లను దారి మళ్లించారు. ప్రమాదానికి గురైన రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని బస్సుల్లో తరలించామని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు చెప్పారు. 15 రైళ్లను దారి మళ్లించగా, మరో ఏడు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని రైల్వే అధికారులు ప్రకటించారు.

Also Read : Vizianagaram Train Accident : విజయనగరం రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా

రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నాయి, సహాయ కార్యక్రమాలు, అంబులెన్స్‌ల కోసం స్థానిక పరిపాలన ఎన్డీఆర్ఎఫ్ కు సమాచారం అందించారు. ప్రమాద సహాయక రైళ్లు ఘటనాస్థలికి చేరుకున్నాయని డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు.విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని ఎక్కువ అంబులెన్స్‌లను పంపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.

Also Read : Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు

గాయపడిన వారికి సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్యంలోని విజయనగరం రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 9 కి పెరిగింది. విశాఖపట్టణం-రాయగడ ప్యాసింజర్ రైలు, పలాస ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొట్టిన ఘటనలో పదకొండు మంది మరణించగా, 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

పట్టాలు తప్పిన బోగీలు

విశాఖపట్టణం-పలాస ప్యాసింజర్ రైలుకు చెందిన రెండు బోగీలు, విశాఖ- రాయగడ ప్యాసింజర్ రైలు ఇంజను పట్టాలు తప్పాయి. విజయనగరం నుంచి రాయగడ వెళ్తున్న రైలు విశాఖపట్నం నుంచి పలాసకు అదే మార్గంలో వెళ్తున్న ప్యాసింజర్ రైలును ఢీకొనడంతో బోగీలు పట్టాలు తప్పాయని ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో తెలిపారు. విశాఖపట్నం-రాయగడ రైలు సిగ్నల్ ఓవర్‌షూట్ చేయడం వల్ల రైళ్లు ఢీకొన్నాయి.

మానవ తప్పిదమే రైలు ప్రమాదానికి కారణం

ఈ రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో ప్రధాని మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సత్వర సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని, ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని రైల్వే అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.