Maredumilli Accedent: మారేడుమిల్లి వద్ద ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆటో.. యువకుడు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి (Maredumilli Accedent)మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Tribal youth dies in auto-truck collision at Maredumilli.

  • మారేడుమిల్లి వద్ద ఘోర ప్రమాదం
  • లారీని ఢీకొట్టిన గిరిజనుల ఆటో
  • యువకుడు మృతి, ఎనిమిదిమందికి గాయాలు

Maredumilli Accedent: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి వారపు సంతకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన గిరిజనుల ఆటోను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక గిరిజన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.

Suvendu Adhikari: సన్యాసి చిన్మోయ్ కన్నీటి దృశ్యం.. 5 గంటల పెరోల్‌పై బంగ్లాదేశ్ దాష్టీకం.. సువేందు సంచలన కామెంట్స్

లారీని ఢీకొట్టిన ఆటో.. ఒకరు మృతి:

కెచ్చేలవాడ గ్రామానికి చెందిన గిరిజనులు సంత పనులు ముగించుకుని ఆటోలో వస్తుండగా, బోదులూరు సమీపంలో ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాములమామిడి గ్రామానికి చెందిన సాధల రాజారెడ్డి (28)తో పాటు మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే బోదులూరు పీహెచ్‌సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజారెడ్డి మృతి చెందాడు. మారేడుమిల్లి(Maredumilli Accedent) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.