Bhumana Karunakar Reddy : నాస్తికుడు, క్రిస్టియన్ విమర్శలపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రియాక్షన్

నేను నాస్తికుడిని, క్రిస్టియన్ అని రకరకాలుగా రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను అనరాని మాటలు అంటున్నారు. Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy – TTD : నాస్తికుడు, క్రిస్టియన్ అంటూ తన గురించి కొందరు చేస్తున్న విమర్శలపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. 17 సంవత్సరాల క్రితమే తాను టీటీడీ ఛైర్మన్ గా పని చేశానని ఆయన గుర్తు చేశారు. విమర్శలకు భయపడి వెనక్కి తగ్గేవాడిని కాదన్నారు. దళిత వాడల్లో వేంకటేశ్వర స్వామి కల్యాణాలు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి.

అంతేకాదు తిరుమల మాఢవీధుల్లో చెప్పులు లేకుండా తిరిగేలా వ్యస్థను ఏర్పాటు చేసింది తానే అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపే వాడిని కాదన్నారు. తాను పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడినని, ఇలాంటి వాటికి భయపడబోనని స్పష్టం చేశారు. తిరుపతిలో మానవ వికాస వేదిక నిర్వహించిన మూడు తరాల మనిషి పుస్తకావిష్కరణ సభలో భూమన మాట్లాడారు. (Bhumana Karunakar Reddy)

Also Read..Anitha Vangalapudi : తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే అంతే.. సీఎం జగన్‌కి వంగలపూడి అనిత సీరియస్ వార్నింగ్

”నేను నాస్తికుడిని, క్రిస్టియన్ అని రకరకాలుగా రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను అనరాని మాటలు అంటున్నారు. నేను 17 సంవత్సరాల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా పని చేశాను. మతాంతీకరణ జరగకూడదు అనే ఆలోచనతో 32వేల మంది సామాన్యులకి కల్యాణమస్తు ద్వారా పెళ్లిళ్లు చేయించాను. వేంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ చెప్పులు ఉండకూడదని నిషేధించిన వ్యక్తిని నేనే. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ నేనే. దళితవాడలకు శ్రీవెంకటేశ్వరస్వామిని తీసుకెళ్లి కల్యాణం చేయించింది నేనే. నేను క్రిస్టియన్, నాస్తికుడిని అని ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారికి ఇదే నా సమాధానం” అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

టీటీడీ నూతన ఛైర్మన్ గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే, టీటీడీ ఛైర్మన్ గా భూమను నియమిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు ఘాటు వ్యాఖ్యలు చేశాయి. భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు అని, క్రిస్టియన్ అని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

Also Read..Nagari Constituency: నగరిలో ఇన్ని సవాళ్ల మధ్య మంత్రి రోజా ఎలా నెగ్గుకువస్తారో!?

ఇక ఏపీ ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ నూతన పాలకమండలిపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కళంకితులకు బోర్డులో సభ్యత్వం ఇచ్చారని ప్రతిపక్ష నేతలు ఫైర్ అవుతున్నారు. నేరస్తులకు, అన్యమతస్తులకు బోర్డులో సభ్యత్వం ఇచ్చి టీటీడీ పవిత్రతను సీఎ జగన్ మంటగలిపారని మండిపడుతున్నారు.

టీటీడీ బోర్డు నియామకాలకు సంబంధించిన నియమ నిబంధనలను ముఖ్యమంత్రి జగన్ గాలికి వదిలేశారని విపక్ష నేతలు ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయిన వెంటనే టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని విమర్శించారు. తిరుమల పవిత్రతపై జగన్ కు ఏమాత్రం నమ్మకం లేదనే విషయం ఈ నియామకాలతో మరోసారి నిరూపితమైందన్నారు. హిందూమత సంప్రదాయాలను పాటించే వారినే పాలకమండలిలో నియమించాలని డిమాండ్ చేశారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో సీఎం జగన్ కు బాగా తెలుసని, అయినా జగన్ పొరపాట్లు చేస్తున్నారని టీడీపీ నేతలు హెచ్చరించారు.