శ్రీవారి లడ్డూలను అక్కడ భక్తులకు అందుబాటులో ఉంచుతాం: టీటీడీ ఈవో
అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
ఆగస్టు నెలలో శ్రీవారిని 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. హుండీ కానుకలు రూ.125.67 కోట్లు వచ్చాయని, విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.06 కోట్లుగా ఉందని అన్నారు. పలు ప్రాంతాల్లో ఉన్న టీటీడీ కల్యాణ మండపాలు సమాచార కేంద్రాల్లో భక్తులకు శ్రీవారి లడ్డూలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
గత వారం రోజుల్లో సమాచార కేంద్రాలకు 75 వేల లడ్డూలు పంపామమని, టీటీడీకి నాణ్యతలేని నెయ్యి సరిపడా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టామని చెప్పారు. లడ్డూల తయారీలో వినియోగించే నెయ్యి నాణ్యమైనది కొనుగోలు చేయడానికి నిపుణులతో కమిటీ వేశామని తెలిపారు.
రంగు, రుచి, వాసన గుర్తించడానికి సెన్సరీ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. సెన్సరీ టెస్టింగ్ కోసం 20 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని తెలిపారు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి సమర్పించే నైవేద్యాలు రుచిగా లేవని ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.
ఆర్గానిక్ ముడి సరుకులు యూనిఫాంగా లేకపోవడమే రుచి, నాణ్యత లేదని భావిస్తున్నానని అన్నారు. అలిపిరి నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు పునః ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
Also Read: అయ్యయ్యో.. నేను ఇప్పుడు ఏం చేయాలి? అంటూ బోరున ఏడ్చిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే