రమణ దీక్షితులపై వేటు.. టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవే ..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

TTD Board Meeting : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశం ముగిసింది. సోమవారం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను తొలగించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీ అధికారులు, పాలకమండలి, ముఖ్యమంత్రి, జియ్యంగార్లు, ఆలయ వ్యవస్థ పై తీవ్రంగా విమర్శలు చేసిన రమణదీక్షితులను విధులనుండి తొలగిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

Also Read : వైసీపీ కీలక సమావేశం.. నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

  • టీటీడీ పాలకవర్గం నిర్ణయాలు ఇవే..
  • టీటీడీలో అన్నివిభాగాల్లో పనిచేస్తున్న తొమ్మిది వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతూ నిర్ణయం.
  • నడకదారిలో గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాళ్ళమిట్ట వద్ద నిత్య సంకీర్తనార్చన ఏర్పాటుకు నిర్ణయం
  • శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలికి రూ.1.69 కోట్లతో కొత్త బంగారు వాకిళ్ళు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • ప్రతిఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం. టీటీడి క్యాలెండర్ లో పొందుపర్చాలని నిర్ణయం.
  • మంగళసూత్రాల తయారీకి నాలుగు కోట్లతో ప్రముఖ బంగారు వ్యాపార సంస్థలకు టెండర్ ఆమోదం.
  • కార్పొరేషన్లోని అటవీశాఖ కార్మికులను తిరిగి సైసోటీలోకి చేర్చి జీతాలు పెంపు.
  • పాదిరేడులోని టీటీడీ ఉద్యోగస్తులు ఇంటిస్థలాల లేఅవుట్ అభివృద్ధికి 8.16 కోట్లు తూడా కు చెల్లించాలని నిర్ణయం.
  • రూ.3.89 కోట్లతో తిరుచానూరు ఆలయంలో విద్యుత్తు అలంకరణ.
  • రూ.4.12 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రమ హోమం నిర్వహణకు అలిపిరి వద్ద శ్వాశత భవనం నిర్మాణం.
  • 3.15 కోట్లతో తిరుమల జలాశయాలువద్ద కొత్త మోటరు పంపుసెట్లు ఏర్పాటు.
  • తిరుమలలో ఎఫ్ఎంఎస్ సేవలకు మరో మూడేళ్ళు పొడగింపు.
  • గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవవిగ్రహాలకు బంగారుపూత చేయాలని నిర్ణయం.
  • అలిపిరి, గాలిగోపురం, లక్ష్మీనరసింహస్వామి వద్ద ఉన్న పురాతన బావులు ఆధునీకరణ.
  • బాలబాలికలకోసం సులభశైలిలో భగవద్గీత వివిధ భాషలలో పుస్తకాలు రూపొందించేందుకు 3.72 కోట్లు.
  • శ్రీలంకలో శ్రీవారి కళ్యాణం నిర్వహించాలని బోర్డు ఆమోదం.

ట్రెండింగ్ వార్తలు