వైసీపీ కీలక సమావేశం.. నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

ఈ సమావేశానికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నేతలు హాజరుకానున్నారు.

వైసీపీ కీలక సమావేశం.. నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

YCP Key Meeting

YCP Key Meeting : ఎల్లుండి (ఫిబ్రవరి 27) తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు ఈ కీలకమైన మీటింగ్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ లో సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నేతలు హాజరుకానున్నారు. రీజినల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ అబ్జర్వర్లు హాజరుకానున్నారు.

ఈ నెల 27న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన సమావేశం నిర్వహించనుంది. జగన్ దీనికి హాజరవుతారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, జిల్లా మండల స్థాయి అధ్యక్షులకు సమాచారం వెళ్లింది. అలాగే సచివాలయాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు, జిల్లా మండల స్థాయి కోఆర్డినేటర్లకు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని సమాచారం వెళ్లింది. 175 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలందరూ ఈ కీలక మీటింగ్ కు రాబోతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో.. పార్టీని పూర్తిగా సమాయత్తం చేయడంతో పాటు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఇప్పటికే సిద్ధం పేరుతో పార్టీ కార్యకర్తలతో భారీ బహిరంగ సభలు వైసీపీ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 3 సభలు నిర్వహించారు. మార్చి 3న మరొక సభ కూడా జరగబోతోంది.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..