ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

AP Elections 2024: ఎన్నికల వేళ ఇప్పటివరకు వైసీపీ, టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో పోటీ ఎలా ఉండనుంది?

ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

AP Elections 2024

Updated On : February 25, 2024 / 12:09 PM IST

టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడంతో ఆయా స్థానాల్లో వారికి పోటీగా వైసీపీ నుంచి ఎవరెవరు బరిలోకి దిగుతారన్న దానిపై క్లారిటీ వచ్చింది. రోజు 118 మందితో తెలుగు దేశం-జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే.

అందులో 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, 24 మంది జనసేన అభ్యర్థులు ఉన్నారు. జనసేన పోటీ చేసే 24 సీట్లకుగాను 5 సీట్లకు అభ్యర్థులను పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ ప్రకటించిన 94 మందిలో 23 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. మరోవైపు, ఇప్పటికే వైఎస్సార్సీపీ ఇన్‌చార్జిల జాబితాను విడుదల చేసింది.

ఆయా స్థానాల్లో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. వైసీపీలో మార్పులు చేర్పులు కొనసాగుతూ జాబితాలు విడుదలయ్యాయి. పార్లమెంట్‌తో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఇన్‌చార్జ్‌లను మార్చారు. ఎన్నికల వేళ ఇప్పటివరకు వైసీపీ, టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో పోటీ ఎలా ఉండనుంది? ఆయా అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి? 10టీవీ ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్ట్…

TDP-Jana Sena first list : టీడీపీ – జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. 94 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు వీరే ..