Tirumala Tirupati Devasthanams: భక్తులకు శుభవార్త.. స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా అందుబాటులోకి వచ్చాయి. అక్టోబ‌ర్ నెల‌కు సంబంధించి టికెట్ల కోటాను బుధవారం టీటీడీ విడుదల చేసింది.

Tirupati Tirumala Devasthanam

Tirumala Tirupati Devasthanams: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా అందుబాటులోకి వచ్చాయి. అక్టోబ‌ర్ నెల‌కు సంబంధించి టికెట్ల కోటాను బుధవారం టీటీడీ విడుదల చేసింది. అయితే అక్టోబ‌ర్ నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌ సేవా టికెట్లను మధ్యాహ్నం 2గంటలకు లక్కీ డీప్ ద్వారా కేటాయించనున్నారు. వీటితో పాటు అక్టోబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను కూడా సాయంత్రం 4గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు.

TTD: తిరుమలలో పెరిగిన రద్దీ.. భక్తులకు టీటీడీ ప్రత్యేక సూచన

ఇదిలాఉంటే ఆర్జిత సేవ కోసం మొత్తం 54వేల టికెట్లు ఆన్ లైన్ లో టీటీడీ అందుబాటులో ఉంచింది.ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకోవాలంటే అధికారిక వెబ్ సైట్ https://ttdsevaonline.com లో సందర్శించి బుక్‌ చేసుకోవచ్చునని టీటీడీ తెలిపింది. ఇదిలాఉంటే తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

TTD Kalyanamastu : టీటీడీ కళ్యాణమస్తు తాత్కాలికంగా వాయిదా

మంగళవారం తిరుమల శ్రీవారిని 68,467 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.67కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఇదిలాఉంటే గత ఐదు నెలలుగా రూ. 100కోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటుతోంది. ఆగస్టు నెలలో ఇప్పటికే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 100కోట్ల మార్కును దాటేయగా.. ఈ నెలలో రూ. 140కోట్లకు చేరే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు