తిరుమలలో నేను చాలా పనులు చేయాలి- టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు ఒక గొప్ప బాధ్యతను అప్పజెప్పారు.

Ttd Chairman Br Naidu (Photo Credit : Google)

Ttd Chairman Br Naidu : టీటీడీ బోర్డు చైర్మన్ గా మీడియా అధిపతి బీఆర్ నాయుడిని నియమించింది ఏపీ ప్రభుత్వం. 24 మంది సభ్యులతో టీటీడీ నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది. కాగా, టీటీడీ చైర్మన్ గా తనను నియమించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కు బొల్లినేని రాజగోపాల్ నాయుడు కృతజ్ఞతలు చెప్పారు. ‘నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు. నేను అదే జిల్లాకు చెందిన వాడిని. అక్కడ పెరిగిన వాడిని. తిరుమలలో నేను చాలా పనులు చేయాలి. పలు అంశాల్లో ప్రక్షాళన చేయాలి. భక్తులకు మరిన్ని సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చిస్తాం’ అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.

”ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు ఒక గొప్ప బాధ్యతను అప్పజెప్పారు. ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారం నేను నడుచుకుంటాను. అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, పురంధేశ్వరి, ఎన్డీయే పెద్దలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

తిరుమలలో నేను అక్కడ పుట్టి పెరిగిన వాడిని. నాకు అక్కడి విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసు. ఈ పదవి నా బాధ్యతను పెంచింది. తిరుమలను ఎలా బాగు చేయాలి? భక్తులకు మరిన్ని సౌకర్యాలు ఎలా కల్పించాలి? ఇవన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. బోర్డు మీటింగ్ లో పెట్టి సక్రమంగా పద్ధతి ప్రకారం చేయాలన్నది నా ఆశయం, అభిమతం. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని టీటీడీ బోర్డు నూతన చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.

టీటీడీ బోర్డు చైర్మన్ రేసులో మొదటి నుంచి కూడా బీఆర్ నాయుడు పేరు ప్రముఖంగా వినిపించింది. చివరికి ఆ పదవి ఆయనే దక్కింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. బీఆర్ నాయుడు చైర్మన్ గా ఆయనతో పాటు 23 మంది సభ్యులుగా ఎంపికయ్యారు. వీలైనంత తొందరలోనే అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడబోతున్నాయి.

మొదటి నుంచి కూడా టీటీడీ చైర్మన్ రేసులో బీఆర్ నాయుడు పేరు ప్రముఖంగా వినించింది. బీఆర్ నాయుడు చైర్మన్ గా, ఆయనతో పాటు 23 మందిని సభ్యులుగా చేశారు.

Also Read : 48 గంటల్లో ఖాతాల్లోకి డబ్బులు.. మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..