48 గంటల్లో ఖాతాల్లోకి డబ్బులు.. మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..

ఈ పథకం ఎవరికైనా అందకపోతే.. 1967 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి.. ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.

48 గంటల్లో ఖాతాల్లోకి డబ్బులు.. మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..

AP Free Gas Cylinder Scheme 2024 (Photo Credit : Google)

Updated On : October 30, 2024 / 6:35 PM IST

AP Free Gas Cylinder Scheme : సూపర్ సిక్స్ లో భాగంగా ఎల్లుండి నుంచి మరో హామీ అమలు కాబోతోంది. నవంబర్ 1న మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేటలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇప్పటికే మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో గ్యాస్ డెలివరీ కోసం ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

గ్యాస్ సిలిండర్లను 24 నుంచి 48 గంటల్లో డెలివరీ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్న సర్కార్.. గ్యాస్ డెలివరీ అయిన 48 గంటల్లో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయనుంది. ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 894 కోట్ల 92 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ పథకం కోసం 2వేల 674 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయని ప్రాథమికంగా అంచనా వేసింది.

ఈ పథకం ఎవరికైనా అందకపోతే.. 1967 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి.. ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. దీపం-2 స్కీమ్ లో భాగంగా ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున పేదలకు అందించనుంది ఏపీ సర్కార్. ఏడాదికి మూడు విడతల్లో మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును పెట్రోలియం సంస్థలకు సర్కార్ అందజేసింది. ఈ నెల 29 నుంచి ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్దిదారులకు ప్రభుత్వం కల్పించింది. కేంద్రం ఇచ్చే 25 రూపాయల రాయితీ పోను.. మిగిలిన 876 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు ఫోకస్..
ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నారు. నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళంలో పర్యటించి ఇచ్ఛాపురంలోని సోంపేటలో ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ ను ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. అనంతరం రెండో రోజు పర్యటనలో భాగంగా నవంబర్ 2న విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు చంద్రబాబు పరిశీలించనున్నారు. అదే విధంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read : కేసులు, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో జంపింగ్ బాట.. విడుదల దారెటు..!