TV Blast : బాబోయ్.. బాంబులా పేలిన టీవీ, వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. టీవీ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.

Tv Blast

TV Blast : అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. టీవీ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని మారెమ్మ గుడి ప్రాంతానికి సమీపంలో ఓ ఇంట్లో టీవీ పేలింది. ఈ ఘటనలో సిద్ధలింగ (32) అనే వ్యక్తి చనిపోయాడు.

మంగళవారం ఉదయం టీవీ ఆన్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. ఈ ఘటనలో సిద్ధలింగ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు టైలరింగ్ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. విద్యుత్ అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే టీవీ పేలిందని తెలుస్తోంది. పూర్తి కారణాలు తెలుసుకునే పనిలో విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీవీ బాంబులా పేలడం, ఒకరు చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో వారు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్లే టీవీ పేలిందా? లేక మరో కారణం ఏదైనా ఉందా? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.