Proddatur Government Hospital
Proddatur Government Hospital : కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో విషాదం నెలకొంది. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి చెందారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆసుపత్రికి చేరుకుని కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో ఒక రూమ్ లో ఉన్న రోగులకు సక్రమంగా ఆక్సిజన్ అందకపోవడంతో ఊపిరాడక ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
విషయం తెలుసుకున్న జిల్లా అధికార యంత్రాంగం వెంటనే అక్కడున్న వ్యవస్థను సెట్ రైట్ చేసేందుకు కృషి చేస్తున్నారు. అయితే 6 కేజీల ఆక్సిజన్ ట్యాంక్ ఉన్నప్పటికీ సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.