YSRCP : ఆ ఇద్దరు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు, టాప్ టు బాటం లేపి కొడతా- వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

YSRCP : సింహానికి ఆకలేస్తే వేటాడే తింటుంది. ఇక రండి చూసుకుందాము. 2024లో పోటీ చేస్తా. ఎవడొచ్చినా గెలిచి చూపిస్తా.

YSRCP : ఆ ఇద్దరు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు, టాప్ టు బాటం లేపి కొడతా- వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Anil Kumar Yadav (Photo : Google)

Updated On : June 23, 2023 / 8:47 PM IST

Anil Kumar Yadav – Nellore : వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. సొంత పార్టీ నాయకులపైనే సంచలన ఆరోపణలు చేశారు. సిటీ నియోజకవర్గంలోని ఇద్దరు వైసీపీ నాయకులు తన వెనుక గోతులు తవ్వుతున్నారని ఆయన ఆరోపించారు. వారిద్దరూ బాహుబలి, భళ్లాలదేవుడిలా ఫీలవుతున్నారని ధ్వజమెత్తారు. ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, బాబాయి రూప్ కుమార్ యాదవ్, నుడా ఛైర్మన్ ద్వారకా నాథ్ లక్ష్యంగా అనిల్ కుమార్ యాదవ్ ఈ పరోక్ష వ్యాఖ్యలు చేసినట్టు పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

కొట్టినా, కోసినా వైసీపీనే:
” నా గుండె చప్పుడు జగన్. నా బ్లడ్ లో అణువణువు జగన్. నేను జగన్ కు మిలిటెంట్ స్క్వాడ్ లాంటి వాడిని. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పార్టీని వీడే ప్రసక్తే లేదు. కొట్టినా కోసినా నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే. ఉదయం నుంచి నాపై కొన్ని చానల్స్ రకరకాల వార్తలు ప్లే చేస్తున్నాయి. ఎదురు చూస్తున్న వారి కోరిక తీరదు.

Also Read..Anantapur Constituency: అనంతపురంలో పవన్ పోటీ చేస్తే జనసేన, వైసీపీ మధ్యే పోటీ.. లేదంటే అంత ఈజీ కాదు!

నన్ను ఎవడూ మార్చలేడు:
ఈ మధ్య బాగా తిరిగా. 20 రోజులు విశ్రాంతి తీసుకున్న అంతే. ఈ లోపే ఏవేవో ప్రచారం చేశారు. జగనన్న తప్ప జిల్లాలో నన్ను ఎవడూ మార్చలేడు. ఏడాది నుంచి కామ్ గా ఉంటే గుచ్చుతూనే ఉన్నారు. ఇక సైలెంట్ గా ఉండను. ఫైర్ బ్రాండ్ గానే ఉంటా. 2024లో పోటీ చేస్తా. ఎవడొచ్చినా గెలిచి చూపిస్తా.

ఓ రాజమాతను బరిలో దింపాలని తహతహ లాడుతున్నారు:
నారాయణను 2019లోనే ఒడించా. మళ్లీ ఆయన పోటీ చేస్తే నా ప్యాంట్ ఏంది తడిచేది? 2024లో అనిల్ బుల్లెట్ ట్రైన్ లా ఉంటాడు. ఎవరు అడ్డు వచ్చినా గుద్దేస్తా. నా ప్రత్యర్ధి వంద కోట్లు తెస్తారో, 200 వందల కోట్లు తెస్తారో తెమ్మను. నేను గెలిచి చూపిస్తా. అనిల్ కుమార్ యాదవ్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్నా. పెద్ద కుటుంబంగా చెప్పుకునే ఆ పేరునే లేకుండా చేశా. సిటీ నియోజకవర్గంలోని ఇద్దరు వైసీపీ నాయకులు నా వెనుక గోతులు తవ్వుతున్నారు. వారిద్దరూ బాహుబలి, భళ్లాలదేవుడిలా ఫీలవుతున్నారు. ఓ రాజమాతను సిటీ నియోజకవర్గంలో పోటీ చేయించాలని తహతహ లాడుతున్నారు.

Also Read..Titan Submersible: టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలుడుకు కారణం.. కెటాస్ట్రోపిక్ ఇంప్లోషన్ అంటే ఏమిటి?

ఉదయం సరే అంటారు, రాత్రికి మందు తాగి కుట్ర చేస్తారు:
జగనన్న చెప్పినట్లు చేస్తామని చెబుతారు. రాత్రికి మందు తాగి కుట్ర చేస్తారు. ఇలాంటి నాయకులు ఎన్నికల్లో నాకు సాయం చేస్తారంటే నమ్మాలా? కొంతమంది నా వెనుక నుండి కొడుతూనే ఉన్నారు. ఇక రండి చూసుకుందాము. కొద్దిగా సైలెంట్ గా ఉందాము అనుకున్నా. కానీ, ఉండనివ్వడం లేదు. సింహానికి ఆకలేస్తే వేటాడే తింటుంది. టాప్ టు బాటం లేపి కొడతా. నన్ను ఎదిరించే సత్తా ఉంటే నా ఎదురుగా వచ్చి ఢీకొట్టాలి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్త మీద చెయ్యి వేస్తే నా మీద వేసినట్టే.

అన్నను అంటే.. టాప్ టు బాటం లేపి కొడతా:
చిన్న వయసులోనే రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యా. అది నాకు జగనన్న ఇచ్చిన అవకాశం. అనిల్.. ఈసారి ఎన్నికల్లో నువ్వు తప్పుకో అని జగన్ చెపితే సంతోషంగా తప్పుకుంటా. ఆనం రామనారాయణరెడ్డి జగన్ ను తిడుతుంటే జిల్లాలో కొందరు నాయకులు కామ్ గా ఉన్నారు. కానీ నేను అలా కామ్ గా ఉండను. టాప్ టు బాటం లేపి కొడతా” అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.