AP govt key decision : ఏపీలో ప్రతి మున్సిపాలిటీలో ఇద్దరు వైస్ ఛైర్మన్లు, ప్రతి కార్పొరేషన్ లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు

ఏపీలో కొత్త ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో ఇద్దరు వైస్ ఛైర్మన్లను, ప్రతీ కార్పొరేషన్‌‍లో ఇద్దరు డిప్యూటీ మేయర్లను నియమించాలని నిర్ణయించింది.

two vice chairmen and two deputy mayors : ఏపీలో కొత్త ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో ఇద్దరు వైస్ ఛైర్మన్లను, ప్రతీ కార్పొరేషన్‌‍లో ఇద్దరు డిప్యూటీ మేయర్లను నియమించాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్ల నియామకాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం మున్సిపల్ చట్టాన్ని సవరించనుంది.

ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఈ నెల 18న యథాతథంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక పురపాలక ఎన్నికల్లో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ మొత్తం కార్పొరేషన్లను క్లీన్‌ స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. 75 పురపాలక సంఘాలు, 11 కార్పోరేషన్లను గెలుచుకొని అఖండ విజయం సాధించింది. ఏపీ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఇదే తొలిసారి.

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ వైసీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం. దీంతో మూడు రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇక నగర పాలక సంస్థల్లో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ.. మున్సిపాలిటీలల్లోనూ బోర్లా పడింది. కనీసం ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది.

ట్రెండింగ్ వార్తలు