Gnaneshwari Case : చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి!
Gnaneshwari Case : కాకినాడ జిల్లాలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క మృతి చెందింది. కుక్క మృతితో దర్యాప్తునకు సంబంధించిన కీలక ఆధారాన్ని పోలీసులు కోల్పోయారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
- Sreehari A
- Updated on- June 13, 2026 / 03:56 PM IST
Gnaneshwari Missing Case
Gnaneshwari Case : రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క ఒక్కసారిగా మృతిచెందింది. అదృశ్యమైన చిన్నారికి సంబంధించి విచారిస్తున్న పోలీసులకు కుక్క మృతితో బిగ్ షాక్ తగిలింది.
కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టించిన ఈ కేసులో చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. పాపతో పాటు బయటకు వెళ్లిన కుక్క 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది.
ఆహారం లేక పెంపుడు కుక్క మృతి :
అయితే, ఆ కుక్క ఆధారంగా పాప ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు దాని మెడకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి అడవిలోకి వదిలారు. కానీ, ఆ కుక్క 80 నిమిషాల్లో 8 కిలోమీటర్లు సంచరించింది. పలు ప్రాంతాల్లో తిరిగి చివరికి ఇంటికి చేరుకుంది.
కుక్కను మళ్లీ అడవిలోకి పంపేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గాలింపు చర్యల్లో పాల్గొన్న ఈ కుక్క నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది.
కుక్క మృతితో పోలీసులకు దర్యాప్తులో కీలక ఆధారం లేకుండా పోయింది. కీలక ఆధారమైన పెంపుడు కుక్క అనుమానాస్పద రీతిలో మృతిచెందడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్క మృతికి కారణాలేంటి? చిన్నారి ఏమైంది? అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
