Two Looted Gold Friend House : అన్నం పెట్టిన ఇంటికే కన్నం.. పిలిచి బిర్యానీ పెడితే ఇల్లు లూటీ చేసిన ఫ్రెండ్స్

అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశారు ఇద్దరు స్నేహితులు. ఫ్రెండ్స్‌ను ఇంటికి పిలిచి బిర్యానీ పెడితే.. ఆ ఇంటినే లూటీ చేశారు. స్నేహ బంధానికే మాయనిమచ్చ తెచ్చారు. ఏడు లక్షల 60 వేల రూపాయలకు విలువువైన బంగారు అభరణాలను దోచుకెళ్లారు. కడపలో ఈ చోరీ జరిగింది.

Two looted gold friend house

Two Looted Gold Friend House : అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశారు ఇద్దరు స్నేహితులు. ఫ్రెండ్స్‌ను ఇంటికి పిలిచి బిర్యానీ పెడితే.. ఆ ఇంటినే లూటీ చేశారు. స్నేహ బంధానికే మాయనిమచ్చ తెచ్చారు. ఏడు లక్షల 60 వేల రూపాయలకు విలువువైన బంగారు అభరణాలను దోచుకెళ్లారు. కడపలో ఈ చోరీ జరిగింది. దేవుని కడప టెంపుల్‌ స్ట్రీట్‌కు చెందిన ఆవుల శ్రీనివాసులు కుటుంబం తమ చిన్న కొడుకు ఆవుల రూపేశ్‌ కుమార్‌ను ఇంట్లో ఉంచి ఈనెల 6న తిరుమల వెళ్లింది. రూపేశ్‌ తన ఫ్రెండ్స్‌ను షేక్‌ సోనుతో పాటు మరో బాలుడిని భోజనానికి పిలిచాడు. రూపేశ్‌ కుమార్‌.. స్నేహితుల కోసం బిర్యానీ తేవడానికి బయటకు వెళ్లినప్పుడు బీరువాలోని బంగారాన్ని దోచుకున్నారు.

స్నేహితుడు తెచ్చిన బిర్యానీ తిని చల్లగా జారుకున్నారు. శ్రీనివాసులు కుటుంబ సభ్యులు బీరువాకు తాళం వేసి.. కీస్‌ను బీరువాకే ఉంచడం అలవాటు. తిరుమల దవై దర్శానికి వెళ్లే క్రమంలో కూడా అదే పని చేశారు. గతంలో తన స్నేహితుడు రూపేశ్‌ కుమార్‌ ఇంటికి వచ్చిన షేక్‌ సోను ఈ విషయాన్ని గమనించాడు. దోపిడీకి ఇదే అదునుగా భావించిన సోను.. తన ఫ్రెండ్‌ బిర్యానీ తీసుకురావడానికి వెళ్లన సమయంలో బీరువా తెరిచి 152 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశాడు.

Maharashtra Cop House : ఎస్ఐ ఇంట్లోనే దొంగతనం.. పది లక్షల విలువైన బంగారం, నగదు చోరీ

ఈ విషయం రూపేశ్‌కు తెలియదు. తిరుమల నుంచి తిరిగొచ్చిన శ్రీనివాసులు కుటుంబ సభ్యులు చోరీని గుర్తించి.. చిన్న చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. రూపేశ్‌ను విచారిస్తే.. ఫ్రెండ్స్‌ను పిలిచి బిర్యానీ పెట్టిన విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చారు. సోనుపై నిఘా పెట్టి అతడితో పాటు మరో బాలనేరస్థుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.