Maharashtra Cop House : ఎస్ఐ ఇంట్లోనే దొంగతనం.. పది లక్షల విలువైన బంగారం, నగదు చోరీ

పోలీసు డ్యూటీలో ఉంటే, అతడి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. పోలీసు ఇంట్లోకి చొరబడ్డ దొంగలు రూ.10 లక్షల విలువైన సొత్తు ఎత్తుకెళ్లారు.

Maharashtra Cop House : ఎస్ఐ ఇంట్లోనే దొంగతనం.. పది లక్షల విలువైన బంగారం, నగదు చోరీ

Maharashtra Cop House: మహారాష్ట్రలో దొంగలు ఏకంగా పోలీసు ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర, జల్నా జిల్లాలోని, అంబద్ పట్టణంలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక శార్ధా నగర్‌లోని సబ్ ఇన్‌స్పెక్టర్ మధుకర్ పాటిల్ ఇంట్లోకి సోమవారం ఉదయం 11.30 గంటలకు దొంగలు చొరబడ్డారు.

Bengaluru Woman: బెంగళూరులో కరెంట్ షాక్‌తో యువతి మృతి.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అంటూ ప్రజల ఆగ్రహం

ఇంటి తలుపులు పగలగొట్టి, లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న రూ.8.75 లక్షల విలువైన బంగారు నగల్ని, రూ.1.8 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన జరిగిన సమయంలో మధుకర్ పాటిల్ డ్యూటీలో ఉన్నారు. డ్యూటీ ముగించుకుని మధ్యాహ్నం విశ్రాంతి కోసం ఇంటికి వెళ్లిన మధుకర్.. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. అనంతరం కేసు నమోదు చేశాడు. మొత్తం చోరీకి గురైన సొమ్ము విలువ రూ.10.55 లక్షలు ఉంటుందని మధుకర్ తెలిపాడు.

Suresh Raina Retirement: క్రికెట్‪‌కు సురేష్ రైనా గుడ్ బై.. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు!

కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ పరిశిలించి నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.