Suresh Raina Retirement: క్రికెట్‪‌కు సురేష్ రైనా గుడ్ బై.. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు!

స్టార్ క్రికెటర్ సురేష్ రైనా క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Suresh Raina Retirement: క్రికెట్‪‌కు సురేష్ రైనా గుడ్ బై.. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు!

Suresh Raina Retirement: ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా క్రికెట్‪‌కు గుడ్ బై చెప్పారు. ఇంతకుముందే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన రైనా.. తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రైనా 13 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు.

Asia Cup 2022: నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్.. గెలిస్తేనే ఫైనల్ ఆశలు సజీవం

తన కెరీర్లో మొత్తం 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడారు. 226 వన్డేల్లో 5,615 పరుగులు, 18 టెస్టుల్లో 768 పరుగులు, 78 టీ20ల్లో 1,605 పరుగులు చేశారు. తన కెరీర్లో రైనా ఎన్నో ఘన విజయాలు అందుకున్నారు. అరుదైన రికార్డుల్ని కూడా సొంతం చేసుకున్నారు. టెస్టుల్లో అరంగేట్రంలోనే సెంచరీ చేసి ఆకట్టుకున్నారు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచారు. బ్యాటింగ్‌లోనే కాకుండా, బౌలింగ్‌లో కూడా తనదైన ముద్ర వేశారు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 62 వికెట్లు తీశారు. ఇక ఐపీఎల్‌లోనూ రాణించారు. ఐపీఎల్‌లో 205 మ్యాచులాడి, 5,528 పరుగులు చేశారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచారు.

Uttar Pradesh Jail : ఉత్తర ప్రదేశ్‌ జైల్లో ఖైదీలకు ఎయిడ్స్… ఒకేసారి 26 మందికి

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడారు. చెన్నై నాలుగుసార్లు టైటిల్ గెలుచుకోగా, ఆ జట్టులో రైనా ఉన్నారు. అయితే, ఈ ఏడాది రైనాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. 2020 ఆగష్టు 15న రైనా తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించారు. అదే రోజు ఎమ్మెస్ ధోనీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రైనా.. తనకు సహకారం అందించిన బీసీసీఐ, చెన్నై సూపర్ కింగ్స్, ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌తోపాటు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.