Uttar Pradesh Jail : ఉత్తర ప్రదేశ్‌ జైల్లో ఖైదీలకు ఎయిడ్స్… ఒకేసారి 26 మందికి

యూపీలోని ఒక జైల్లో ఖైదీలు హెచ్ఐవీ బారిన పడ్డారు. బారాబంకి జిల్లాకు చెందిన జైల్లో ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా 26 మందికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. గతంలో కూడా ఇలా పలు కేసులు బయటపడ్డాయి.

Uttar Pradesh Jail : ఉత్తర ప్రదేశ్‌ జైల్లో ఖైదీలకు ఎయిడ్స్… ఒకేసారి 26 మందికి

Uttar Pradesh Jail: దశాబ్దాలుగా అవగాహన కలిగిస్తూ, నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా హెచ్ఐవీ/ఎయిడ్స్ ఇంకా పూర్తిగా అదుపులోకి రావడం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఒక జైల్లో 26 మందికి ఎయిడ్స్ సోకింది. బారాబంకిలో ఉన్న జైల్లో ఖైదీలకు ఇటీవల త్రీ ఫేజ్ హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు.

Asia Cup 2022: నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్.. గెలిస్తేనే ఫైనల్ ఆశలు సజీవం

గత నెల 10 నుంచి ఈ నెల 1 వరకు పరీక్షలు నిర్వహించగా, 26 మంది ఖైదీలకు హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. దీంతో హెచ్ఐవీ సోకిన ఖైదీలను అధికారులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. వారిలో ఇద్దరిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి, అవసరమైన యాంటీ-రెట్రో వైరల్ చికిత్స అందిస్తున్నారు. జైల్లో మొత్తం 3,300 మందికిపైగా ఖైదీలు ఉన్నట్లు, వారందరికీ హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించిన్లు జిల్లా వైద్యాధికారులు, జైలర్ అలోక్ శుక్లా తెలిపారు. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలో మహిళా జైల్లో కూడా ఖైదీలకు హెచ్ఐవీ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Telangana Assembly Session 2022 : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేంద్ర వైఖరిని ప్రశ్నించనున్న సీఎం కేసీఆర్

గత జూన్‌లో కూడా యూపీలోని గోండా జిల్లాలో ఉన్న ఒక జిల్లా జైల్లో ఆరుగురు ఖైదీలకు హెచ్ఐవీ సోకింది. అలాగే జూలైలో షహరన్ పూర్ జిల్లాలోని జైల్లో ఖైదీలకు పరీక్షలు నిర్వహిచంగా 23 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలింది. దీంతో యూపీలోని జైళ్లలో వరుసగా హెచ్ఐవీ కేసులు బయటపుతుండటం సంచలనంగా మారింది.