Asia Cup 2022: నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్.. గెలిస్తేనే ఫైనల్ ఆశలు సజీవం

ఆసియా కప్, సూపర్-4లో నేడు ఇండియా-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇండియా ఫైనల్ చేరే అవకాశాలుంటాయి.

Asia Cup 2022: నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్.. గెలిస్తేనే ఫైనల్ ఆశలు సజీవం

Asia Cup 2022: ఆసియా కప్‌లో భాగంగా నేడు ఇండియా-శ్రీలంక తలపడనున్నాయి. సూపర్-4లో భారత్ ఆడుతున్న రెండో మ్యాచ్ ఇది. ఈ టోర్నీలో భారత్‌కు అత్యంత కీలకమైన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్ ఫైనల్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. అప్పుడు ఇతర సమీకరణాల మీద ఇండియా ఫైనల్ పోరు ఆధారపడి ఉంటుంది. గత మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో భారత్ ఈ మ్యాచ్ తప్పక నెగ్గి తీరాల్సిన పరిస్థితి ఉంది. సూపర్-4లో ఉన్న నాలుగు జట్లలో ప్రతి జట్టు, మరో మూడు జట్లతో ఆడాలి. ఇందులో ఇప్పటికే ఇండియాపై పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌పై శ్రీలంక గెలిచాయి.

Telangana Assembly Session 2022 : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేంద్ర వైఖరిని ప్రశ్నించనున్న సీఎం కేసీఆర్

దీంతో ఒక్కో మ్యాచ్ గెలిచిన రెండు జట్లూ ఇండియాకంటే ముందున్నాయి. ఈ రోజు మ్యాచ్‌లో భారత్ ఓడి శ్రీలంక గెలిస్తే, మన జట్టు ఫైనల్ చేరే అవకాశాలు దాదాపు ముగిసినట్లే. ఒకవేళ తర్వాతి మ్యాచ్‌లో మన జట్టు ఆఫ్ఘనిస్తాన్‌పై గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించి, ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిస్తే ఇరు జట్లు రెండేసి విజయాలతో ముందుంటాయి. తర్వాత పాకిస్తాన్‌-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టు టాప్‌లో ఉంటుంది. ఓడిన జట్టు రెండో స్థానంతో ఫైనల్ చేరుతుంది. అందువల్ల ఇవాళ్టి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఫైనల్ చేరే అవకాశాలున్నాయి. లేదంటే ఇతర జట్ల విజయాల మీద మన అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇండియాకు సంబంధించి బ్యాటింగ్‌లో కోహ్లీ రాణించడం శుభ పరిణామం.

Delhi liquor Scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ దూకుడు.. హైదరాబాద్‌తోపాటు ఒకేసారి 35 చోట్ల సోదాలు

ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శుభారంభాన్ని అందించాలి. అయితే, మిడిలార్డర్ బ్యాటింగ్ మాత్రం పేలవంగా ఉంది. గత మ్యాచ్‌లో రిషబ్ పంత్, హార్ధిక్ పటేల్, దీపక్ హుడా విఫలమయ్యారు. ఇక భారత బౌలింగ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్‌లో కూడా మెరుగైతేనే ఇండియాకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాగా, శ్రీలంక మాత్రం మంచి జోష్‌లో ఉంది. వరుసగా రెండు విజయాలతో ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. అందుకే శ్రీలంకపై నెగ్గే విషయంలో భారత్ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎక్కువగా ప్రయోగాల జోలికి వెళ్లకుండా, సరైన జట్టును ఎంపిక చేసి ప్రణాళికతో ఆడితే విజయం సాధ్యమని భారత క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.