Bengaluru Woman: బెంగళూరులో కరెంట్ షాక్‌తో యువతి మృతి.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అంటూ ప్రజల ఆగ్రహం

బెంగళూరు నగరంలో ఒక యువతి విద్యుత్ షాక్‌కు గురై మరణించింది. అఖిల అనే యువతి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా, అదుపుతప్పి కింద పడబోయింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకోగా షాక్ తగిలి, ప్రాణాలు కోల్పోయింది.

Bengaluru Woman: బెంగళూరులో కరెంట్ షాక్‌తో యువతి మృతి.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అంటూ ప్రజల ఆగ్రహం

Bengaluru Woman: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరెంట్ షాక్‌తో అఖిల అనే యువతి మృతి చెందింది. బెంగళూరులో ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా, నగరమంతా జలమయమైన సంగతి తెలిసిందే. అఖిల అనే 23 ఏళ్ల యువతి సోమవారం రాత్రి మోకాలిలోతు నీళ్లలో స్కూటీపై ఇంటికి వెళ్తోంది.

Suresh Raina: క్రికెట్‪‌కు సురేష్ రైనా గుడ్ బై.. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు!

వైట్‌ఫీల్డ్ ఏరియాలో నీళ్లు ఎక్కువగా ఉండటంతో స్కూటీని నడపడం వీలుకాక, చేత్తో తోసుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో అదుపుతప్పి జారిపడబోయింది. వెంటనే పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకుంది. కానీ, ఆ స్తంభానికి విద్యుత్ ప్రవహిస్తూ ఉండటంతో అఖిల కరెంట్ షాక్‌కు గురైంది. కొందరు ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణా లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శిస్తున్నారు. బెంగళూరు అధికారులు, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే అఖిల మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

Asia Cup 2022: నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్.. గెలిస్తేనే ఫైనల్ ఆశలు సజీవం

సాధారణ ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు నగరం వర్షపు నీటిలో చిక్కుకుంది. ఐటీ కారిడార్‌తోపాటు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల వరద ప్రవాహంలో చిక్కుకున్న ప్రజల్ని అధికారులు పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.