Ap : ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులు

గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్‌. కొండవీటి వాగు ప్లాంట్‌ నుంచి రాయపూడి వరకు కరకట్ట విస్తరణ పనులు చేపడుతున్నారు.

Undavalli Dam : గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్‌. కొండవీటి వాగు ప్లాంట్‌ నుంచి రాయపూడి వరకు కరకట్ట విస్తరణ పనులు చేపడుతున్నారు. 150 కోట్ల రూపాయలతో ఈ విస్తరణ పనులను చేపడుతోంది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పైలాన్‌ని సీఎం జగన్‌ నేడు ఆవిష్కరించనున్నారు.

15 కిలోమీటర్ల పొడవు, 10మీటర్ల వెడల్పుతో కరకట్టను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న రోడ్డు ద్వారా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుకు చేరుకోవాల్సి ఉంది. ఇదే రోడ్డును వీవీఐపీలు, రైతులు, సాధారణ ప్రజలు ఉపయోగిస్తున్నారు. దీంతో వీఐపీల రాకపోకల కారణంగా తరచుగా సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రోడ్డు విస్తరణ పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది ప్రభుత్వం. ఈ పనుల బాధ్యతను మేఘా ఇంజనీరింగ్‌ సంస్థకు అప్పగించింది ప్రభుత్వం.

Read More : నేడు కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణస్వీకారం

ట్రెండింగ్ వార్తలు