Undavalli Sridevi
Undavalli Sridevi : చంద్రబాబు నాయుడు అరెస్టుని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును అరెస్ట్ చేసి ఏదో ఫ్యాక్షనిస్టు, నేరగాడిలా అరెస్టు చేసి తరలించారని అక్రమంగా పెట్టిన ఈ కేసు నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారని అన్నారు. ఇటువంటి అరెస్టులకు చంద్రబాబు బెదిరే వ్యక్తి కాదని రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని అన్నారు. గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయానికి వచ్చిన తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబుని అరెస్టు చేసిన విధానం సరిగా లేదన్నారు.
అరెస్టు చేసినా చంద్రబాబు అదరలేదని ..ఇటువంటి అరెస్టులకు భయపడే వ్యక్తి కాదని కార్యకర్తలు అంతా ధైర్యంగా ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా భూస్తాపితం అవటం ఖాయమన్నారు.తాత్కాలికంగా పాపం గెలవొచ్చు.. కానీ అంతిమ విజయం సత్యానిదేనన్నారు. ఈ ఆరోపణల నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని త్వరలోనే బెయిల్ పై వచ్చి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని అన్నారు.
Balakrishna : చంద్రబాబును జైల్లో పెట్టేందుకే స్కామ్‌ను క్రియేట్ చేశారు : ఎమ్మెల్యే బాలకృష్ణ
పులి ఒక అడుగు వెనక్కు వేస్తే బయపడినట్లు కాదనీ..వైసీపీ నేతలు వేస్తున్న రాళ్లతో టీడీపీ అధినేత చంద్రబాబు అంతపురం కట్టడం ఖాయమన్నారు.వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిచి చంద్రబాబు సీఎం అవ్వటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.ఉండవల్లి శ్రీదేవి 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో పార్టీని విభేధించారు. మార్చి 2023న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాసింగ్ ఓటింగ్‌కు పాల్పడ్డందనే ఆరోపణలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 24 మార్చి 2023న పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఆమె టీడీపీ నేతగా కొనసాగుతున్నారు.